Begin typing your search above and press return to search.

దీపిక ర‌ణ్‌ వీర్ ప్రేమ‌లో ఎలా ప‌డింది!

By:  Tupaki Desk   |   4 Dec 2020 3:30 PM GMT
దీపిక ర‌ణ్‌ వీర్ ప్రేమ‌లో ఎలా ప‌డింది!
X
బాలీవుడ్ క్రేజీ స్టార్ దీపికా పదుకొనే మొద‌ట్లో రణబీర్ సింగ్ తో డేటింగ్‌లో వున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల‌ బ్రేక‌ప్ చెప్పిన దీపిక ఎన‌ర్జిటిక్ హీరో ర‌ణ్ ‌వీర్ సింగ్‌ తో ప్రేమ‌లో ప‌డింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఇటలీలోని లేక్ కోమో వద్ద ఉత్కంఠభరితమైన విల్లా డెల్ బాల్బియానెల్లో నవంబర్ 14 , 15 తేదీలలో వీరి వివాహం అట్ట‌హాసంగా జ‌రిగింది. ఆ త‌రువాత ఈ జంట ల‌వ్ క‌పుల్స్ ‌కి రోల్ మోడ‌ల్ గా నిలిచారు.

ర‌ణ్‌వీర్‌ తో దీపిక క్యాజువ‌ల్‌ గా డేటింగ్ మొద‌లుపెట్టింద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 13 ఏళ్ల వ‌య‌సులోనే తాను ఒక‌రితో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని అయితే దాన్ని కొన‌సాగించేందుకు మాత్రం ఇష్ట‌ప‌డేద‌ని చెప్న‌పింది దీపిక‌. ` రణ్ ‌వీర్ ను 2012లో క‌లిశాను. అప్పుడే మా మ‌ధ్య బంధం ఏర్ప‌డింద‌ని గ్ర‌హించాను. ఆ విష‌యాన్ని వెంట‌నే బ‌య‌ట‌పెట్టాను. అయితే అది క్యాజువ‌ల్ డేటింగ్‌. దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంటాన‌ని మాత్రం ర‌ణ్ ‌వీర్‌ తో చెప్ప‌లేదు. నాకు న‌చ్చిన వ్య‌క్తులు ఎదురుప‌డితే త‌న అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేస్తాన‌ని త‌న‌తో ముందే చెప్పాను` అని తెలిపింది దీపిక‌.

రణబీర్ కపూర్‌తో బ్రేక‌ప్ అయిపోయాక చాలా డిప్రెష‌న్‌ లోకి వెళ్లిపోయింద‌ట‌. అదే స‌మాయంలో ర‌ణ్ ‌వీర్‌ తో `రామ్ ‌లీలా` చేయ‌డం.. అదే స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డ‌టంతో డేటింగ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఆరేళ్లు దీపిక ర‌ణ్ ‌వీర్ డేటింగ్‌ లో వున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. అది పెళ్లి దాకా వెళ్ల‌డంతో 2018 న‌వంబ‌ర్ 14 అండ్ 15 ఈ రెండు రోజులు ఇట‌లీలో వీరి డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రిగి ఒక్క‌ట‌య్యారు. ఇప్ప‌టికీ ఈ జంట బాలీవుడ్ ‌లో ల‌వ్ బ‌ర్డ్స్ కి రోల్ మోడ‌ల్ ‌గా నిలుస్తోంది.