Begin typing your search above and press return to search.
అఫిషియల్.. ఔను వారిద్దరూ విడిపోయారు
By: Tupaki Desk | 1 Jan 2022 4:38 AM GMTబిగ్ బాస్ వల్ల కలిసిన జంటలు చాలా ఉన్నాయి.. కాని విడి పోయిన జంట కేవలం దీప్తి సునైన మరియు షన్నూ లదే అయ్యి ఉంటుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వారి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీప్తి సునైన తనను బ్లాక్ చేసింది అంటూ కొన్ని రోజుల క్రితం లైవ్ లో షన్నూ చెప్పాడు.
హైదరాబాద్ వెళ్లి ఆమెతో మాట్లాడుతాను.. ఆమె అప్పుడప్పుడు ఇలా బ్లాక్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం మళ్లీ చక్కబడుతుంది.. ఖచ్చితంగా ఇద్దరు ఒక్కటి అవుతారు.. పెళ్లి కూడా చేసుకుంటారని అభిమానులు ఆశించారు. కాని ఇద్దరం ఇక మీదట కలిసి జర్నీ చేయలేం అంటూ దీప్తి సునైన తేల్చి చెప్పింది. ఇద్దరం కూడా ఎవరి దారిన వాళ్లం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొంది.
సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ ను షేర్ చేసిన దీప్తి సునైన తమ బ్రేకప్ ఈసారి సీరియస్.. మళ్లీ మేము కలవం అన్నట్లుగా తేల్చి చెప్పింది. అయిదు సంవత్సరాల ఈ స్నేహం.. ప్రేమకు సుదీర్ఘ చర్చలు.. సంప్రదింపులు ఆలోచన తర్వాత బ్రేకప్ చెబుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. దీప్తి సునైన కాస్త డీప్ గానే షన్నూ విషయంలో హర్ట్ అయినట్లుగా ఆమె పోస్ట్ లను చూస్తుంటే అర్థం అవుతోంది.
ఖచ్చితంగా షన్నూ వైపు నుండి ప్రయత్నాలు ఇంకా కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాని దీప్తి మాత్రం చాలా ఆవేదనతో అతడి నుండి దూరం అవ్వాలనే నిర్ణయానికి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు బిగ్ బాస్ తర్వాత కనీసం కలిసిందే లేదు.. ఎందుకు దీప్తి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ అంతా కూడా ముక్కున వేలేసేకుంటున్నారు.
షన్నూ హౌస్ లో ఉన్న సమయంలో దీప్తి చాలా సపోర్ట్ గా నిలిచింది. ఓటింగ్ కోసం అభ్యర్థించడం మాత్రమే కాకుండా షన్నూ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకు కూడా ఆమె వచ్చింది. ఆ సమయంలో షన్నూ పై ఆమెకు ఉన్న ప్రేమను కళ్లలో చూపించింది. ఆ తర్వాత కూడా షన్నూ కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై ఆమె కనిపించే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా షన్నూ కు బ్రేకప్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. షన్నూ ఇప్పటి వరకు ఈ విషయమై స్పందించలేదు.
షన్నూ షాక్ లో ఉండి ఉంటాడు. వీరిద్దరి బ్రేకప్ కు కారణం సిరి అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సిరి తో షన్నూ క్లోజ్ గా మెలగడం వల్లే షన్నూ నుండి దీప్తి దూరం అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా షన్నూ మరియు దీప్తి సునైనల అయిదు ఏళ్ల ప్రేమ వ్యవహారంకు తెర పడ్డట్లయ్యింది.