Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టేనా?
By: Tupaki Desk | 14 Dec 2022 5:30 PM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ `లైగర్`. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో అక్కడ కూడా పాగావేయాలని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన `లైగర్` కోసం ఎంతో శ్రమించి గాయాలని సైతం లెక్క చేయకుండా నటించాడు. విజజ్ఞ్ బారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ డిజాస్టర్ అనిపించుకుంది.
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచో `లైగర్` డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని ఊహించని షాకిచ్చింది. కెరీర్ పీక్స్‌కి వెళుతుందనుకున్న టైమ్ లో `లైగర్`తో భారీ షాక్ తగలడంతో విజయ్ దేవరకొండ చాలా వరకు నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ మూవీ ఫ్లాప్ తరువాత విజయ్ దేవరకొండ పెద్దగా ఎక్కడా స్పందించడం మానేశాడు. ప్రస్తుతం తను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న `ఖుషీ` మూవీలో నటిస్తున్నాడు. సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.
ఈ మూవీని కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దురదృష్ట వశాత్తు సామ్ అనారోగ్యానికి గురి కావడంతో ఈ మూవీ షూటింగ్ గత కొంత కాలంగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ముందు ఈ మూవీని దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారి చేతికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
సమంత కోలుకుని సెట్ లో కి ఎంట్రీ ఇవ్వడానికి సమయం పడుతుందని గ్రహించిన విజయ్ దేవరకొండ ఈ సమయంలో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.