Begin typing your search above and press return to search.

రాజమౌళి ట్వీట్ కు దిల్లీ విమానాశ్రయం ఆన్స‌ర్

By:  Tupaki Desk   |   5 July 2021 6:34 AM GMT
రాజమౌళి ట్వీట్ కు దిల్లీ విమానాశ్రయం ఆన్స‌ర్
X
కరోనా నేపథ్యంలో దిల్లీ విమానాశ్రయంలో కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకపోవడంపై ప్ర‌యాణీకులు అసహనానికి గురవుతున్నట్లు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిన‌దే. దిల్లీ విమానాశ్రయ సిబ్బంది జక్కన్న ట్వీట్ కు రిప్ల‌య్ ఇచ్చింది.

``ప్రియమైన రాజమౌళి గారు.. సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. విహారయాత్రకు స‌రైన సౌక‌ర్యాల‌ను అందిస్తాం. ఆర్టీపీసీఆర్ వివరాల కోసం డెస్క్ లు ఉన్నాయి. మేము అదనపు డెస్కుల్ని ఏర్పాటు చేస్తాము. ప్రయాణీకులకు కనిపించే విధంగా బోర్డులను అమర్చుతున్నాం`` అని సిబ్బంది నుంచి సమాధానం ఇచ్చింది.

రాజమౌలి శుక్రవారం ఉదయం దిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు అక్క‌డ అసౌక‌ర్యంపై కాస్త అస‌హ‌నం క‌న‌బ‌రిచారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షల‌ను చేయించుకోవాలి. ఆర్టీపీసీఆర్ కోసం విమానాశ్ర‌యంలో ద‌ర‌ఖాస్తును నింపాల్సిన చోట సరైన సౌకర్యాలు లేవని జక్కన్న ట్వీట్ చేశారు. అలాగే విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే చోట వీధి కుక్క‌ల స‌మూహంతో ఇబ్బంది ఉంద‌ని కూడా రాజ‌మౌళి త‌న ట్వీట్ లో తెలియ‌జేశారు. విదేశీయుల్లో ఇలాంటివి అగౌర‌వం పెంచుతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఈ సూచ‌న‌కు విమానాశ్ర‌య సిబ్బంధి నుంచి ఆన్స‌ర్ లేదు.

ప్రస్తుతం రాజ‌మౌళి `ఆర్.ఆర్.ఆర్` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. అక్టోబర్ లో ఈ మూవీ ప్ర‌క‌టించిన తేదీకే రిలీజ్ కానుంది. అక్టోబ‌ర్ 13 రిలీజ్ తేదీని మ‌రోసారి చిత్ర‌బృందం క‌న్ఫామ్ చేసింది. సెకండ్ వేవ్ ప్ర‌భావం ప్ర‌స్తుతం క్షీణిస్తున్న నేప‌థ్యంలో జ‌క్క‌న్న టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.