Begin typing your search above and press return to search.
‘అప్పట్లో..’ కోసం అక్కడోళ్ల డిమాండ్లు
By: Tupaki Desk | 8 Jan 2017 7:28 AM GMTఎలా మొదలుపెట్టామన్నది కాదు.. ఎలా ముగించామన్నది ముఖ్యం. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా గత వారం కొంచెం డల్లుగానే మొదలైంది. కానీ రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చాయి. ముందు వారం మొక్కుబడిగా నడిపిస్తున్న సినిమాల్ని తీసేసి ఈ వారాంతంలో చాలా చోట్ల ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను వేశారు ఎగ్జిబిటర్లు. రెండో వారం ప్రపంచవ్యాప్తంగా వంద థియేటర్లు పెరిగాయి ఈ సినిమాకు. మంచి సినిమాకు ఎవరూ అడ్డం పడలేరని రుజువు చేసింది ‘అప్పట్లో ఒకడుండేవాడు’. తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ బాక్సాఫీస్ లీడర్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమానే.
తెలుగు రాష్ట్రాల్లో మాదిరే అమెరికాలోనూ ఈ సినిమాకు మొదట్లో తక్కువ స్క్రీన్లే ఇచ్చారు. ఐతే సినిమాకు అద్భుతమైన రివ్యూలు రావడం.. మౌత్ టాక్ కూడా చాలా బాగుండటంతో ప్రేక్షకులు స్క్రీన్లు పెంచాలని డిమాండ్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో రిలీజ్ చేసిన 9పీఎం ఎంటర్టైన్మెంట్ కు ఈ తరహా డిమాండ్లు పెరగడంతో రెండో వారానికి స్క్రీన్లు పెంచక తప్పని పరిస్థితి. తొలి వారాంతంతో పోలిస్తే రెండో వారాంతంలో స్క్రీన్లు పెరిగాయి. కలెక్షన్లు కూడా పెరిగాయి. సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టుకునే అవకాశముంది. ఇప్పటికే బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఫుల్ రన్లో ఈ సినిమా మంచి లాభాలే తెచ్చిపెట్టేలా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/