Begin typing your search above and press return to search.
స్మారక చిహ్నం ముందు పెళ్లిళ్లు..పునీత్ కి పద్మ శ్రీ డిమాండ్
By: Tupaki Desk | 8 Nov 2021 11:30 PM GMTపవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ పరిశ్రమకి తీరనిలోటు. శాండల్ వుడ్ చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసిపెట్టి ఆయన కనుమరుగయ్యారు. ఇక పునీత్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ లెజండరీ రాజ్ కుమార్ తనయుడైనా..సూపర్ స్టార్ అయినా ఎంతో డౌన్ టూ ఎర్త్. గొప్ప మానవతా వాది. స్వచ్చంద సంస్థలను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. ఎందరో పేద విద్యార్ధుల్ని చదించారు. పునీత్ వ్యక్తిత్వం...సేవా కార్యక్రమాలు చూసి అన్ని భాషల పరిశ్రమల నటులే షాక్ అయ్యారు. దీన్ని బట్టే పునీత్ ఎంతో గొప్ప ధాతృహృదయం గలవారో అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో పునీత్ చేసిన సేవల్ని గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు..ప్రజా ప్రతినిధులు.. ఆయన అభిమానులు..ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు పునీత్ మెమోరియల్ ని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. చాలా మంది అభిమానులు స్మారక చిహ్నం వద్ద వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. వీటన్నింటి మధ్యా పునీత్ కి పద్మశ్రీ ఇవ్వాలన్న డిమాండ్ డే బై డే మరింత పెరుగుతోంది. పునీత్ పేరుని కేంద్రానికి సిపార్సు చేయాలని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బిసీ పాటిల్ ముఖ్యమంత్రిని కోరారు.
`పునీత్ కి పెద్ద అభిమానిని. నటుడిగానే కాకుండా సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను ఇలాంటి అవార్డుతో సత్కరించాల్సిన బాధ్యత ఉంద`ని మంత్రి వర్యులు అన్నారు. ఈ డిమాండ్ కు పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ కూడా మద్దతు పలికారు. ఇంకా కన్నడ నటుడు ప్రేమ్.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ డిమాండ్ కి మద్దతు తెలిపారు. సోమవారం న్యూ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2020 విజేతలకు పద్మ అవార్డులు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పునీత్ కి పద్మ శ్రీ ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.