Begin typing your search above and press return to search.
అమితాబ్ కుటుంబానికి నోట్ల రద్దు ఝలక్!
By: Tupaki Desk | 3 Jan 2017 1:45 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుపై అనేక రూపాల్లో సెటైర్లు పేలుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ఇష్టంలేని వారు సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు - జోకులు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా వాట్సాప్ లో చెక్కర్లు కొడుతున్న మెసేజ్ కూడా అలాంటిదే. నోట్ల రద్దు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని కూడా వదల్లేదని కొందరు క్రియేట్ చేసిన వాట్సాప్ మెసేజ్ ను.. నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రియేటివ్ సెటైర్ల కోసం ఔత్సాహికులు రెండు పాత ఫొటోలను వాడుకున్నారు. వీటిలో అభిషేక్ భార్య ఐశ్వర్య రాయ్ - ఆమె అత్త జయా బచ్చన్ లు ఒకే చీర కట్టుకున్నారు. అంతే.. చూశారా నోట్ల రద్దు బాలీవుడ్ ఫ్యామిలీ బచ్చన్లను కూడా వదల్లేదు.. అత్తాకోడళ్లు ఒకే చీర కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ వాట్సాప్ లో ఫన్నీ మెసేజ్ ను సృష్టించేశారు. నిజానికి వేర్వేరు సందర్భాల్లో ఒకే చీరను ఆ ఇద్దరూ కట్టుకున్నా.. ఆ ఫొటోలు చాలాకాలం కిందటివి. వాటికీ ఇప్పుడు నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ ఫొటోలనే ఆధారంగా చేసుకొని నోట్ల రద్దుకు లింకు పెట్టి కొందరు నెటిజన్లు ఆనందిస్తున్నారు. ఇవే ఫొటోలను గతేడాది సెప్టెంబర్ లోనూ ట్విట్టర్ లో వైరల్ గా మారడం విశేషం. ఇలా అత్తాకోడళ్లు ఒకే చీర కట్టుకోవడంపై అప్పుడే నెటిజన్లు ఎన్నో కామెంట్స్ చేశారు. నిజానికి జయా ఈ చీరను 2010లో కట్టుకోగా.. ఐశ్వర్య 2011లో అదే చీరలో కనిపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/