Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం అతను.. చరణ్ కోసం ఇతను

By:  Tupaki Desk   |   18 Nov 2018 3:39 AM GMT
ఎన్టీఆర్ కోసం అతను.. చరణ్ కోసం ఇతను
X
టాలీవుడ్ మెగా మల్టీస్టారర్‌ షూటింగ్‌ కి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించబోయే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేయనున్నారు. ముందుగా ఎన్టీఆర్-చరణ్ కాంబినేషన్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ లోపే తారక్ - చరణ్ ఇద్దరూ లుక్స్ మార్చుకునే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఓవరాల్ ఫిజిక్ మార్చుకోనున్నాడు. ఇందుకోసం హాలీవుడ్ నుంచి లాయ్డ్ స్టీవెన్ అనే ట్రైనర్‌ ను రప్పించాడు రాజమౌళి.

ఇక చరణ్ ఫిజిక్ పరంగా పెద్దగా మార్పులేమీ చేసుకోవాల్సిన అవసరం లేదట. కానీ లుక్ అయితే మారనుందట. అతడి కోసం ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ ఆలిమ్ హాకిమ్ వచ్చాడు. హాకిమ్ ఇప్పటికే రాజమౌళితో రెండు సినిమాలకు పని చేశాడు. దాదాపు దశాబ్దంన్నర కిందట జక్కన్న తీసిన ‘సై’లో నితిన్‌ కు హేర్ స్టైలిస్ట్‌ గా పని చేశాడతను. తర్వాత ‘బాహుబలి’కి కూడా పని చేశాడు. రాజమౌళి తనకెంతో నచ్చిన దర్శకుడని.. ఆయన సినిమాకు మళ్లీ పని చేయడం చాలా సంతోషంగా ఉందని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పాడు హాకిమ్. రాజమౌళి - చరణ్‌ లతో కలిసున్న ఫొటోను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో చరణ్ టోపీ పెట్టుకుని గడ్డంతో కనిపించాడు. సినిమాలోనూ అతను గడ్డంతోనే కనిపిస్తాడని భావిస్తున్నారు. వచ్చే వారం ఒక షెడ్యూల్లో పాల్గొని.. ఆ తర్వాత చరణ్ తిరిగి ‘వినయ విధేయ రామ’లోకి వెళ్లనున్నాడు. అక్కడ మిగిలిన పని పూర్తి చేసి తర్వాత పూర్తిగా ‘ఆర్ ఆర్ ఆర్’కే అంకితం కానున్నాడు.