Begin typing your search above and press return to search.

#డిజైర‌బుల్ మెన్‌: NTR ర్యాంక్ - 3 .. చ‌ర‌ణ్ ర్యాంక్ -4

By:  Tupaki Desk   |   2 Jun 2021 11:30 AM GMT
#డిజైర‌బుల్ మెన్‌: NTR ర్యాంక్ - 3 .. చ‌ర‌ణ్ ర్యాంక్ -4
X
టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్- 2020 జాబితాలో స్నేహితులు తార‌క్ .. రామ్ చ‌ర‌ణ్ 3- 4 స్థానాల్ని కైవ‌శం చేసుకోవ‌డం టాక్ ఆఫ్ ది టైన్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ ఆర్.ఆర్.ఆర్ స్టార్లుగా ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన పాపులారిటీని పెంచుకున్నారు. ఇక ఆ ఇద్ద‌రూ జిమ్నాస్ట్ లుగా మారి తీరైర రూపు రేఖ‌ల‌తో యువ‌త గుండెల్లోకి చొచ్చుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో టాప్- 5లో చోటు ద‌క్కింది.

2019 లో టైమ్స్ జాబితాలో 19 వ స్థానంలో నిలిచిన తార‌క్ ఈసారి మూడో స్థానానికి ఎదిగారు. త‌న స్నేహితుడు రామ్ చరణ్ నాల్గవ స్థానంలో నిలిచాడు. ధృవ సినిమా స‌మ‌యంలోనే రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్ యువ‌త‌రం హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది. ఆర్.ఆర్.ఆర్ కోసం మ‌రింత గొప్ప మేకోవ‌ర్ ని సాధించిన చ‌ర‌ణ్ ఇప్పుడు ఈ ఫీట్ సాధించారు.

తార‌క్ ఈసారి 19 వ ర్యాంక్ నుండి 3వ స్థానానికి ఎదిగాడు. అత‌డు ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో సిక్స్ ప్యాక్ బాడీని సాధించడానికి లాయ్ డ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని ఫోటోషూట్ కోసం షర్ట్ లెస్ అవతార్ లో యాబ్స్ తో పోజు ఇవ్వ‌గా అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. ఇక టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో నంబ‌ర్ వ‌న్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. నంబ‌ర్ 2గా రామ్.. నిల‌వ‌గా నాలుగు ఐదు స్థానాల్లో నాగ‌శౌర్య‌- నాగ‌చైత‌న్య నిలిచారు. సందీప్ కిష‌న్ - రానా- అల్లు అర్జున్- అఖిల్ లాంటి స్టార్లు టాప్ 30 జాబితాలో ఉన్నారు.