Begin typing your search above and press return to search.

డబుల్ డిజాస్టర్ పడినా బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదుగా..!

By:  Tupaki Desk   |   29 Oct 2022 2:30 PM GMT
డబుల్ డిజాస్టర్ పడినా బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదుగా..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ప్రారంభం నుంచీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేలా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో సినిమా సినిమాకూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నాడు. అయితే VD గత కొంతకాలంగా ఎంత కష్టపడుతున్నా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు.

చివరగా నాలుగేళ్ళ క్రితం 'టాక్సీవాలా' సినిమాతో విజయం సాధించిన విజయ్'D.. ఆ తర్వాత వరుస పరాజయాలు చవిచూశాడు. బ్లాక్ బస్టర్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న 'డియర్ కామ్రేడ్' మూవీ ప్లాప్ అయింది. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం తీవ్ర నిరాశ పరిచింది.

ఈ నేపథ్యంలో 'లైగర్' సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేయాలనుకున్నాడు విజయ్. దీని కోసం దాదాపు మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాడు. సినిమా కోసం ఎంత చేయాలో అంత చేసాడు. బాక్సాఫీస్ షేక్ అవుతుందని ధీమా వ్యక్తం చేసాడు. కానీ చివరకు ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు.

భారీ అంచనాలతో విడుదలైన 'లైగర్' సినిమా.. డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలింది. దీంతో VD కి బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ ప్లాప్స్ పడినట్లు అయింది.

అయితే వరుసగా డిజాస్టర్స్ పలకరించినా విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. అతని డిమాండ్ అలానే ఉంది. పరాజయాల ప్రభావం కెరీర్ పై ఏమాత్రం పడలేదు. బ్రాండ్ వాల్యూ కూడా తగ్గకుండా.. అలానే చెక్కుచెదరకుండా ఉందనేది అర్థమవుతోంది.

'లైగర్' తర్వాత ఇటీవల రెండు పెద్ద బ్రాండ్లు విజయ్'D ని తమ బ్రాండ్ అంబాసిడర్‌ గా నియమించుకున్నాయని తెలుస్తోంది. నిజానికి ప్లాప్స్ వస్తున్నప్పటికీ.. వీడీ క్రేజ్ మరియు సోషల్ మీడియా ఫాలోయింగ్ అలానే ఉంది. అందుకే అతిపెద్ద బ్రాండ్స్ కూడా అతన్ని తమ ప్రచార కర్తగా సంతకం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి.

కాకపోతే ఇప్పుడు విజయ్ దేవరకొండ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం ఏర్పడింది. తన మాటలకు వసూళ్లకు ఏమాత్రం పొంతన ఉండటం లేదనే కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో.. ఈసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త వహించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. రాబోయే రోజుల్లో టాప్ లీగ్ లో చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతోకలిసి ''ఖుషి'' అనే రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.

దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ కోసం VD చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇక ఆ మధ్య సెట్స్ మీదకు తీసుకొచ్చిన పూరీ 'JGM' చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లే అని టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.