Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్‌ మాజీ భార్య కిరణ్ రావు ఆస్తుల వివరాలు

By:  Tupaki Desk   |   4 July 2021 11:30 PM GMT
అమీర్ ఖాన్‌ మాజీ భార్య కిరణ్ రావు ఆస్తుల వివరాలు
X
అమీర్‌ ఖాన్‌ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తమ 15 ఏళ్ల వైవాహిక జీవితంకు స్వస్తి పలుకుతున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నా కూడా కొడుక కోసం స్నేహితులుగా కలిసి ఉంటామని వారు చెప్పారు. తమ వైవాహిక జీవితంలో వచ్చిన చిన్న చిన్న బేదాభిప్రాయాల కారణంగా విడిపోతున్నామని.. కాని ముందు ముందు తమకు సంబంధించిన వ్యాపారాలు మరియు ఎన్జీఓస్ ను కాని కలిసి నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. అమీర్‌ ఖాన్ నుండి విడాకులు తీసుకోబోతున్న కిరణ్‌ రావు ఆస్తుల గురించి ప్రస్తుతం మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమెకు ఉన్న ఆస్తుల వివరాల గురించి నెట్టింట సెర్చ్‌ చేస్తున్నారు.

తెలంగాణ కు చెందిన గద్వాల్ ఆస్థానంకు చెందిన వ్యక్తి ఆమె. అందుకే ముందు నుండే పెద్ద మొత్తంలో ఆస్తులు ఆమె కుటుంబంకు ఉంటాయి. కనుక ఆమె ఆస్తుల విషయంలో రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిరణ్‌ రావు ఆస్తుల విషయానికి వస్తే ఆమె 40 మిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉందని జాతీయ మీడియా సంస్థల కథనం. ఎన్నో స్థిరాస్తులు మరియు చరాస్తులు కూడా ఆమెకు ఉన్నాయని.. అనధికారికంగా అంతకు మించే ఆస్తులు ఉన్నా ఆశ్చర్యం లేదని కొందరి అభిప్రాయం.

అమీర్‌ ఖాన్‌ తో పెళ్లి తర్వాత కూడా కిరణ్‌ రావు వ్యాపారాలు చేశారు.. దర్శకురాలిగా కొనసాగారు.. పలు సినిమాలను నిర్మించారు. అంతే కాకుండా స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పేరు దక్కించుకున్నారు. తద్వారా ఆమెకు భారీ మొత్తంలోనే పారితోషికం అంది ఉంటుంది. లేడీ డైరెక్టర్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న బాలీవుడ్ సెలబ్రెటీ కిరణ్‌ రావు మాత్రమే అంటూ టాక్ ఉంది. అమీర్ ఖాన్‌ విడిపోయిన తర్వాత ఆమె ఏం చేయబోతుంది అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపై ఆమె నుండి మరిన్ని సినిమాలు ఆమె నుండి వస్తాయనే నమ్మకంను బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.