Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: బతకడానికి ఇంకో దారుంది!

By:  Tupaki Desk   |   5 Nov 2018 9:08 AM GMT
టీజర్ టాక్: బతకడానికి ఇంకో దారుంది!
X
తమిళ హీరో కార్తి నటించిన తాజా చిత్రం 'దేవ్' టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది. 1.15 నిమషాల డ్యూరేషన్ ఉన్న ఈ టీజర్ లో కార్తి ఓ డిఫరెంట్ థింకింగ్ ఉండే క్యారెక్టర్ లో కన్పించాడు. "ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి. ఎవరో చెప్పారని అర్థంకాని చదువు చదివి ఇష్టం లేని ఉద్యోగం చేసి ముక్కూ మొహం తెలియని ఓ నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పని చేసి ఈగో ప్రెషర్ కాంపిటీషన్ లో ఇరుక్కుని అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతోందో అర్థం కాకుండా బతకడం ఓ దారి.... ఇంకో దారుంది.." అంటూ హీరో కార్తి తన ఫీలింగ్స్ చెప్పేశాడు.

ఇక సీన్ కట్ చేస్తే ఒక రేసింగ్ బైక్ లో కార్తి అంతెత్తు మట్టిదిబ్బ మీద నుండికే గాల్లోకి లేచి జుమ్మని కిందకు లాండ్ కావడం.. తెల్లటి మంచు పర్వతాలలో ట్రెక్కింగ్ చెయ్యడం.. అమ్మాయిలతో వాటర్ బెలూన్స్ విసిరే అట ఆడడం.. ఓ హాట్ ఎయిర్ బెలూన్ లో ఆకాశంలో ప్రయాణించడం అన్నీ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. కూల్ అని మనం అనుకునేంతలో నెక్స్ట్ సీన్లో ట్విస్ట్.. కార్తితో ఎవరో కత్తితో పొడవడానికి చూస్తారు. రెడ్ కలర్ ఆడి కార్లో రివర్స్ గేర్ లో రయ్యని దూసుకుపోతుంటాడు. అంటే ఫుల్ యాక్షన్. వీటితో పాటు హీరోయిన్ రకుల్ తో బ్యూటీఫుల్ రొమాంటిక్ షాట్స్ కూడా ఉన్నాయి. టీజర్ ఎండ్ లో మళ్ళీ కార్తి ఫుల్ యాక్షన్ హీరో అవతారం.

ఓవరాల్ గా 100% కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమా ఈ 'దేవ్' అని హింట్స్ ఇచ్చింది టీజర్. రొటీన్ లైఫ్ లో గొర్రెల్లా బతుకుతూ అదే 'సూపర్' అని చాలామంది అనుకున్నట్టు అనుకోకుండా వేరేగా అలోచించడం అనేది కాస్త డిఫరెంట్ క్యారెక్టరైజేషనే. ఇక హ్యారిస్ జయరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్. ఒకరకంగా చెప్తే టీజర్ మొత్తానికి నేపథ్య సంగీతమే హైలైట్. బ్యూటీఫుల్ విజువల్స్ కూడా ఉన్నాయి. హిట్ లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి.

ఈ సినిమాకు దర్శకుడు రజత్ రవిశంకర్. టాగోర్ మధు-రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యేలోపు టీజర్ చూడండి.