Begin typing your search above and press return to search.
ఇంటర్యూః ఒక్క సీన్ రాసినా క్రెడిట్ ఇచ్చారు
By: Tupaki Desk | 1 Sep 2015 6:13 PM GMTప్రస్థానం, వెన్నెల, ఆటోనగర్ సూర్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు దేవాకట్టా. ఎమోషన్, డైలాగుల్లో డెప్త్ అతడి ఆయుధాలు. ఈసారి డైనమైట్ తో వస్తున్నాడు. విష్ణు, ప్రణీత జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 4న రిలీజవుతోంది. ఈ సందర్భంగా దేవా కట్టా ముచ్చట్లివి..
=ఆటోనగర్ సూర్య తర్వాత కొత్తగా కథలు రాసుకుంటున్న టైమ్ లో అరిమానంబి రీమేక్ చేద్దాం.. చూడు అన్నారు విష్ణు. అందులో క్యారెక్టరైజేషన్ నచ్చింది. అయితే అందులోని ఎలిమెంట్స్ ఉపయోగించుకుని నేను కొత్తగా రాసుకున్నా. అవసరమైనంత స్వేచ్ఛనిచ్చాడు విష్ణు. పక్కా స్క్రిప్టు, ప్రణాళికతో 56రోజుల్లో పూర్తి చేశాను. మనసుకు చేరువైన చిత్రమిది. వాస్తవానికి రీమేక్ చేయాలనుకోను. కానీ ఇది నచ్చి చేసిన సినిమా.
=డైనమైట్ కి తమిళ మాతృకతో పోలికే ఉండదు. సమకాలీన సమస్యని ప్రతిబింబించే కథాంశమిది. ఒక అమ్మాయి సమస్యని తన సమస్యగా భావించి హీరో ఏం చేశాడన్నదే సినిమా. ఎనిమీ ఆఫ్ ది స్టేట్, మిషన్ ఇంపాజిబుల్ తరహా చిత్రమిది. అద్భుతమైన రన్ తో ఉంటుంది. ప్రతినాయకుడి ప్రేమను ఎంతో ప్రేమతో తీర్చిదిద్దా. జేడీ అవ్వడం వల్లే అలా చేశానేమో! విష్ణుకి, జేడీకి మధ్య మైండ్ గేమ్ తరహా సన్నివేశాలు సినిమాకే హైలైట్.
=కాలేజీ చదువులు పూర్తయ్యాక, ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రాలు స్నేహితులతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే ఓ కుర్రాడి జీవితంలో మలుపులే సినిమా.
=పెద్ద హీరోతో పెద్ద సినిమాల విషయంలో దర్శకుడు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటే తప్ప సినిమాలకు పరాజయాలు ఉండవు. కానీ చిన్న సినిమాకి అలా కాదు. ప్రతి క్షణం ఆత్రుతగా పనిచేయాలి.
=ఆటోనగర్ సూర్యకి కేవలం 9కోట్లు మాత్రమే ఖర్చయ్యింది. కానీ 25కోట్లు ఖర్చయ్యిందని ప్రచారం చేసి దర్శకుడినైన నా సామర్థ్యాన్ని లూటీ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేయడమే నా సామర్థ్యం.
=బాహుబలికి ఒకే ఒక్క సన్నివేశానికి మాటలు రాశా. కానీ రాజమౌళి పెద్ద క్రెడిట్ ఇచ్చారు. నా ప్రస్థానం నచ్చి ఆయన మెచ్చుకున్నారు. ఆటోనగర్ సూర్య టీజర్ లో డైలాగ్ ని మెచ్చుకున్నారు.
=ప్రస్తుతం నాలుగు కథలున్నాయి. వాటికి ఎవరు సరిపడితే వారినే ఎంపిక చేసుకుంటాను.