Begin typing your search above and press return to search.
రైజింగ్ టైమ్ లో మిస్టేక్ చేస్తున్న మెగా హీరో?
By: Tupaki Desk | 31 March 2020 8:50 AM GMTఒక హీరో కెరీర్ లో ఎంత పైస్థాయికి చేరుకుంటాడు అనే దానికి చాలా కారణాలు ఉంటాయి కానీ వాటన్నిటిలో ముఖ్యమైనది మాత్రం కథల ఎంపిక..దర్శకుల ఎంపిక. ఈ విషయంలో పొరపాట్లు చేస్తే ఎంత పెద్ద హీరో అయినా తన కెరీర్ లో చతికిలపడడం ఖాయం. ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ విషయంలో తప్పటడుగు వేస్తున్నాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ దేవా కట్టా తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక హాట్ టాపిక్ గా మారింది.
తేజు కెరీర్ మొదట్లో సాఫీగానే సాగింది.. త్వరలో స్టార్ హీరోగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనుకునేంతలో వరసగా అరడజను ఫ్లాపులు తగిలాయి. ఒకదాన్ని మించి ఇంకొకటి అన్నట్టుగా తగిలిన ఆ ఫ్లాపుల దెబ్బకు తేజు కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత చేసిన చిత్రలహరి' ఓ మోస్తరు విజయం సాధించడంతో తేజు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన 'ప్రతిరోజూ పండగే' బాక్స్ ఆఫీస్ దగ్గర చక్కని విజయం సాధించి తేజును మరోసారి మిడ్ రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ఉన్న హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం తేజు 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలో నటిస్తున్నాడు. తేజుకు సూట్ అయ్యే రొమాంటిక్ కామెడీ కావడంతో ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. ఇలాంటి సమయంలో దేవా కట్టాతో సినిమా చేయడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు.
దేవా కట్టా దర్శకత్వ ప్రతిభ గురించి ఎవరూ వంక పెట్టలేరు కానీ కమర్షియల్ సక్సెస్ లేని ప్రతిభకు ఎప్పుడూ గుర్తింపు దక్కదు. దేవా కట్టా సినిమా అంటే చాలు ఇండస్ట్రీ లోనే కాదు ట్రేడ్ వర్గాలలో..ప్రేక్షకులలో ఓ రకమైన నెగెటివిటీ కనిపిస్తోంది. తేజు ఇప్పుడిప్పుడే తన కెరీర్లో వరుస విజయాలు నమోదు చేస్తూ మంచి రైజింగ్ లో ఉన్నాడు . ఇలాంటి సమయంలో కమర్షియల్ సక్సెస్ అన్న మాటే లేని దేవా కట్టాతో చెయ్యడం మిస్టేక్ అని.. మెగా హీరో ఈ విషయంలో రిస్క్ తీసుకుంటున్నట్టేనని అంటున్నారు. ఇదొక్కటే కాదు.. దేవా కట్టా వర్క్ స్లోగా ఉంటుంది. తేజు చూస్తేనేమో జెట్ స్పీడ్ కుర్రాడు. మరి ఈ విషయంలో ఇద్దరికీ పొంతన కుదురుతుందా అనేది కూడా ఆసక్తికరమే. మరి ఈ కాంబో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచి చూడాలి.