Begin typing your search above and press return to search.

దేవా కట్టా స్పీడు పెంచాడు

By:  Tupaki Desk   |   31 March 2018 4:31 AM GMT
దేవా కట్టా స్పీడు పెంచాడు
X
ప్రస్థానం.. ఆటోనగర్ సూర్య సినిమాలు దర్శకుడిగా దేవా కట్టాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తరవాత మంచు విష్ణు హీరోగా చేసిన డైనమైట్ సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సుమని కూడా పేలలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న దేవా కట్టా ఇప్పుడు ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులతో ముందుకొస్తున్నాడు.

డైరెక్టర్ క్రిష్ రాజీవ్ రెడ్డిలతో కలిసి ఓ పొలిటికల్ మూవీ తీసేందుకు దేవా కట్టా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశముంది. స్క్రీన్ ప్లేనే హైలైట్ గా ఉండేలా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దేవా కట్టా స్క్రీన్ ప్లేకు తుది మెరుగులు దిద్దే నిలో పడ్డాడు. తెలుగు - తమిళంలో ఒకేసారి సినిమా తీయాలనే ఆలోచన చేస్తున్నారు. ఇదే టైంలో బాహుబలి నిర్మాతలు అర్కా మీడియాతో కలిసి ఓ భారీ చిత్రం చేయడానికి కూడా దేవా రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ పనులు కొలిక్కి వస్తే ఈ ప్రాజెక్టు వివరాలు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

వీటితోపాటు దేవా కట్టా తనకు పేరు తెచ్చిపెట్టిన ప్రస్థానం సినిమాను బాలీవుడ్ లో తీసే పనిలో ఉన్నాడు. హీరో సంజయ్ దత్ లీడ్ రోల్ లో నటించబోతున్నాడు. ఈ ఏడాది వేసవి తరవాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశముంది.