Begin typing your search above and press return to search.

లూటీ చేస్తున్నారని బాధపడిన మరో దర్శకుడు

By:  Tupaki Desk   |   1 Sept 2015 11:29 AM IST
లూటీ చేస్తున్నారని బాధపడిన మరో దర్శకుడు
X
ఇటీవలే శ్రీమంతుడు సినిమా విజయోత్సవ సభలో తనకే కాక ఇండస్ట్రీలో చాలామంది కధా రచయితలకు ఎదిగే అవకాశాన్ని ఇవ్వకుండా తమ సామర్ధ్యాన్ని లూటీ చేస్తున్నారంటూ దర్శకుడు కొరటాల శివ పత్రికాముఖంగా తన వేదనను వేల్లబుచ్చాడు. ఇప్పుడు అలాంటి స్టేట్ మెంట్ నే మరొక టాలెంటెడ్ డైరెక్టర్ డిక్లేర్ చెయ్యడంపై టాలీవుడ్ మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ,

వెన్నెల, ప్రస్తానం, ఆటో నగర్ సూర్య వంటి సినిమాలతో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరుచుకున్న దర్శకుడు దేవా కట్టా. ప్రస్తుతం దేవా, మంచు విష్ణు కలయికలో వస్తున్న డైనమైట్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. హాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ తరహాలో త్రిల్స్ తో నిండి వున్న ఈ సినిమాను 60 రోజుల లోపే పుర్తిచేసానని చెప్పిన దర్శకుడు సినిమా నిర్మాణానికి కేవలం 9 కోట్లే పట్టిందని తెలిపాడు.

అయితే తన ఎదుగుదల ఇష్టంలేని కొందరు పెద్దలు ఈ సినిమా 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందని దుష్ ప్రచారం చేస్తున్నారని ఇది దర్శకుల టాలెంట్ ని లూటీ చేసినట్టే అని వాపోయాడు. చెప్పిన సమయంలో చెప్పిన బడ్జెట్ లో సినిమా తీయగల టాలెంట్ తనకుందని దాన్ని ఎవరు భంగపరచడానికి ప్రయత్నించినా తట్టుకునేది లేదని డైరెక్ట్ కౌంటర్ వేసాడు. యాక్షన్ నేపధ్యంలో సాగే ఈ డైనమైట్ చిత్రంలో విష్ణు సరసన ప్రణీత నటించింది.