Begin typing your search above and press return to search.
ఇది ట్యాలెంటెడ్ డైరెక్టర్ అసహనమేనా?
By: Tupaki Desk | 31 Jan 2016 10:30 PM GMTసినిమాలు ఓకే చేయించుకోవడం కూడా ఇప్పుడు ఓ కళ అయిపోయింది. మంచి స్టోరీతో తీయడం కంటే.. అది మంచి స్టోరీ అని ముందు యాక్టర్లను ఒప్పించడం చాలా కీలకం. సినిమా తీసే ట్యాలెంట్ చాలానే ఉన్నా.. దాన్ని అంత పర్ ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడంలో విఫలం కావడం, కొందరి కొరీర్ ను ఇబ్బంది పెడుతోంది.
వెన్నెల - ప్రస్థానం వంటి సినిమాలతో విభిన్నమైన ట్యాలెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు దేవ్ కట్టా. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య - రీసెంట్ గా డైనమైట్ బాగా నిరాశ పరిచాయి. ఈ రెండింటి తర్వాత దేవ్ కట్టాకు ఆఫర్స్ రావడం లేదు సరికదా.. సినిమా తీసేందుకు పెద్ద స్టార్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదని అంటున్నారు. దీనిపై కాస్త నిరుత్సాహంగానే ఉన్నాడు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. తన అసహనాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకునే ప్రయత్నం చేశాడు.
'సినిమా ప్రతీ హృదయాన్ని తాకాలి, నమ్మాలి. ఒకసారి చెప్పడంతోనే, ఒక డ్రాఫ్ట్ తోనే, చిన్న ఎడిట్ వెర్షన్ తోనో సాధ్యం కాలేదు. ఎప్పటికీ అంతంకాని ఓ ప్రయత్నం లోపాల కారణంగా ఆగిపోతోంది' అంటూ ట్వీట్ పెట్టాడు దేవ్ కట్టా. స్టోరీల విషయంలో పర్ఫెక్ట్ గా ఎంచుకోవడం, పిక్చరైజేషన్ లో ట్యాలెంట్ చూపిస్తున్నా.. నేరేషన్ లో ఉన్న లోపాలే ఈ డైరెక్టర్ ను స్టార్ రేంజ్ కి తీసుకెళ్లలేకపోతోందని.. టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.