Begin typing your search above and press return to search.

బాహుబలి ప్రీక్వెల్: వారిద్దరికీ భలేభలే రెమ్యునరేషన్!

By:  Tupaki Desk   |   17 Nov 2018 6:27 AM GMT
బాహుబలి ప్రీక్వెల్: వారిద్దరికీ భలేభలే రెమ్యునరేషన్!
X
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా స్టామినాను మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది 'బాహుబలి'. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో వెబ్ సీరీస్ రానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తునారు.

ఆర్కా మీడియా వారు.. రాజమౌళి ఈ వెబ్ సీరిస్ కు సహా నిర్మాతలు. ఆనంద్ నీలకంఠంన్ అనే రచయిత రాసిన 'ది రైజ్ ఆఫ్ శివగామి' అనే పాపులర్ బుక్ ఆధారంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది. టాలీవుడ్ దర్శకులు ప్రవీణ్ సత్తారు.. దేవా కట్టా ఈ వెబ్ సీరిస్ కు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. ఈ వెబ్ సీరీస్ లో మొత్తం 30 ఎపిసోడ్స్ ఉంటాయట. మొదటి సీజన్లో 9 ఎపిసోడ్లు ప్రసారం అవుతాయట. తాజా సమాచారం ప్రకారం ఒక్కో ఎపిసోడ్ కు నెట్ ఫ్లిక్స్ వారు రూ. 10 కోట్ల బడ్జెట్ కేటాయించారట. దీన్ని బట్టి ఈ వెబ్ సీరీస్ ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు.

అంతే కాదు.. ఇద్దరూ డైరెక్టర్లు ఈ వెబ్ సీరీస్ ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుతుందట. ప్రవీణ్ సత్తారు.. దేవా కట్టా ఇద్దరూ తమ సినిమాలు డైరెక్ట్ చేసేందుకు తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఇది చాలా ఎక్కువట. స్టార్ డైరెక్టర్ల లీగ్ లోకి చేరకపోయినా ఇద్దరికి టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ అనే పేరు ఉంది. ఈ వెబ్ సీరీస్ ఒక రకంగా వారికి జాక్ పాట్ అనుకోవాలి. ఎందుకంటే.. ఎలాగూ బాహుబలి బ్రాండ్ ఉంది కాబట్టి ప్రేక్షకులు చూస్తారు. భారీ వ్యూస్ వస్తాయి. థియేటర్ రిలీజ్ టైపులో హిట్లు ఫ్లాపుల గోల అస్సలే ఉండదు. అంటే వెబ్ సీరీస్ ష్యూర్ షాట్ హిట్ అన్నట్టు. నెట్ ఫ్లిక్స్ వారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేస్తారు కాబటి వెబ్ సీరీస్ కు మంచి పేరు వస్తే ఇద్దరి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.