Begin typing your search above and press return to search.
మరోసారి రాజమౌళి-దేవా కట్టా కాంబో
By: Tupaki Desk | 5 July 2018 11:20 PM GMTబాహుబలి మూవీతో రాజమౌళి ప్రతిభ విశ్వవ్యాప్తం అయ్యింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజమౌళి అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే తన క్రెడిట్ గురించి రాజమౌళి ఎప్పుడూ బయట చెప్పుకోడు. టాలీవుడ్ లో తనకు సహాయపడ్డ దర్శకులు - లేదా తనకంటే ఎక్కువ క్రియేటివిటీగా ఆలోచించే దర్శకుల గురించి మాత్రం వివిధ వేదికల్లో చెబుతూ కొనియాడుతుంటాడు. బాహుబలి-1 సినిమాలో ఓ సీన్ లో ప్రస్థానం ఫేమ్ దర్శకుడు దేవా కట్టా తనకు రచనా సహకారం అందించాడని అప్పట్లో రాజమౌళి చెప్పాడు. అందుకోసం సినిమా టైటిల్స్ లో కూడా థ్యాంక్స్ కార్డు వేశానని వివరించాడు..
దేవాకట్టా ప్రతిభాశాలి అని నమ్ముతున్న రాజమౌళి తాజాగా మరోసారి అతడికి గొప్ప చాన్స్ ఇచ్చాడు. బాహుబలికి ప్రీక్వెల్ గా ప్రస్తుతం శివగామి పేరుతో ఓ వెబ్ సిరీస్ వస్తోంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఆనంద్ నీలకాంత్ రాసిన ‘శివగామి’ బుక్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ వస్తోంది. ఇందులో శివగామి రాజమాత ఎలా అయ్యింది. కట్టప్ప సింహాసనానికి కట్టుబడి ఉంటానని ఏ పరిస్థితుల్లో వాగ్ధానం చేశాడు లాంటి విశేషాలన్నీ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కోసమే రాజమౌళి-దేవకట్టా కలిసి పనిచేయబోతున్నారనేది టాలీవుడ్ లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట.
తొలుత ఈ వెబ్ సిరీస్ కు రాజమౌళే డైరెక్షన్ చేయాలని భావించాడట.కానీ ఎన్టీఆర్-రాంచరణ్ మల్టీ స్టారర్ పనుల్లో బిజీగా ఉండడంతో అది కుదిరే పనికాదని అనుకున్నాడు. తాను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ దేవా కట్టాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించనున్నారని తెలిసింది. ఏది ఏమైనా రాజమౌళి ఒకవేళ దేవాకట్టాకు అవకాశం ఇస్తే.. డౌన్ గ్రాఫ్ కు వెళ్లిన ఆ దర్శకుడికి పెద్ద కెరియర్ లభించినట్టే..