Begin typing your search above and press return to search.

దేవ‌దాస్ - న‌వాబ్ ఆన్‌ లైన్‌ లో ఫ్రీ!

By:  Tupaki Desk   |   29 Sep 2018 4:27 AM GMT
దేవ‌దాస్ - న‌వాబ్ ఆన్‌ లైన్‌ లో ఫ్రీ!
X
ప్ర‌తి వారంతో పోలిస్తే .. ఈ వారం రిలీజైన దేవదాస్‌ - న‌వాబ్ చిత్రాలు పాజిటివ్ టాక్‌ తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. చెక్క చివంత వాన‌మ్ (న‌వాబ్‌) త‌మిళ వెర్ష‌న్‌కి యునానిమ‌స్‌ గా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌ణి స‌ర్ ఈజ్ బ్యాక్! అంటూ త‌మిళ‌నాట సంబ‌రాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మిశ్ర‌మ స్పంద‌న‌లు వచ్చినా - చెత్త సినిమా కాద‌న్న ప్ర‌శంస‌లు న‌వాబ్‌ కి ద‌క్కాయి. అర‌వింద‌స్వామి - శింబు - జ్యోతిక వంటి బిగ్ స్టార్స్‌ తో మ‌ణిర‌త్నం అద్భుతంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు నాగార్జున‌- నాని కాంబినేష‌న్‌ లో శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన `దేవ‌దాస్‌` ఓపెనింగ్ డే నాగార్జున కెరీర్ బెస్ట్ గా నిలిచింది. మంచి టాక్‌ తోనే ర‌న్ అవుతోంది.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమాల‌కు ఊహించ‌ని థ్రెట్ పైర‌సీ రూపంలో ఎదురైంది. పైర‌సీ అన్న ప‌దం మూడ‌క్ష‌రాలే అయినా దీని ప‌ర్య‌వ‌సానం వంద‌లు, వేల కోట్లు. ప్ర‌తియేటా దీనివ‌ల్ల ఫిలింమేక‌ర్స్ న‌ష్ట‌పోతున్న‌ది ఊహించ‌ని స్థాయిలో ఉంటోంది. ప్ర‌తిసినిమాకి టొరెంట్లు ఆన్‌ లైన్‌ లో అందుబాటులోకి వ‌చ్చేస్తున్నాయి. క్రేజు ఉన్న సినిమాల‌కు తొలిరోజే టొరెంట్లు అందుబాటులోకి రావ‌డం అన్న‌ది ప్ర‌మాద‌క‌రంగా మారింది. ప్ర‌స్తుతం ఆన్‌ లైన్‌ లో దేవ‌దాస్ - న‌వాబ్ చిత్రాల టొరెంట్లు అందుబాటులో ఉన్నాయి. హాస్ట‌ళ్ల‌లో ఇంజినీరింగ్‌ - కంప్యూట‌ర్ విద్యార్థులు సులువుగా డౌన్‌ లోడ్ చేసుకుని పైర‌సీలో చూసేస్తున్నారు. అలాగే ఇవి సీడీల రూపంలోనూ బ‌య‌టికి వెళ్లిపోతున్నాయ్‌.

పైర‌సీని వెబ్‌ సైట్ల నుంచి తీయించ‌క‌పోతే డ్యామేజ్ ఇంకా పెరుగుతూనే ఉంటుందన‌డంలో సందేహం లేదు. అయితే కోలీవుడ్‌ లో నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు విశాల్ ఓవైపు పైరేట్‌ ల‌పై తీవ్ర యుద్ధ‌మే చేస్తున్నాడు. ఇదివ‌ర‌కూ కొంత స‌ఫ‌ల‌మైనా.. పూర్తిగా నిలువ‌రించ‌లేక‌పోయారు. ఇక బాహుబ‌లి టైమ్‌లో ఉవ్వెత్తున పైర‌సీని నివారించేందుకు టాలీవుడ్‌ లోనూ ప్ర‌య‌త్నం సాగింది. యాంటీ పైర‌సీ సెల్‌- సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్‌ మెంట్లు యాక్టివ్‌ గా ప‌ని చేసి పైర‌సీని నివారించ‌గ‌లిగాయి. కానీ య‌థారాజా త‌థా ప్ర‌జ‌! అన్న చందంగా పైర‌సీ టాలీవుడ్‌ లో మ‌ళ్లీ మామూలుగానే ఉంది. తాజాగా దేవ‌దాస్ ఆన్‌ లైన్ లింకులు వైర‌ల్‌ గా మారాయి. అశ్వ‌నిద‌త్ బృందం కొంత‌వ‌ర‌కూ నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసినా పూర్తి ప్ర‌యోజ‌నం లేదు. ఇప్ప‌టికైనా టొరెంట్ల‌ను అరిక‌ట్ట‌క‌పోతే దేవ‌దాస్‌ కి కొంత‌మేర న‌ష్టం త‌ప్ప‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.