Begin typing your search above and press return to search.

దేవాకి కెరీర్ బెస్ట్‌ - దాస్‌ కి సెకండ్ బెస్ట్‌!

By:  Tupaki Desk   |   28 Sep 2018 8:59 AM GMT
దేవాకి కెరీర్ బెస్ట్‌ - దాస్‌ కి సెకండ్ బెస్ట్‌!
X
కింగ్ నాగార్జున‌- నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కులుగా న‌టించిన `దేవ‌దాస్` ఈ గురువారం థియేట‌ర్ల‌లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌నిద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ్‌-నాని బ్రొమాన్స్ వ‌ర్క‌వుట్ అవ్వ‌డంతో వైజ‌యంతి సంస్థ‌కు మ‌రో హిట్టొచ్చిన‌ట్టేన‌న్న టాక్ తొలిరోజు వినిపించింది. ఇక‌పోతే ఈ సినిమా కింగ్ నాగార్జున కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ సాధించింద‌న్న మాటా వినిపిస్తోంది. నాని కెరీర్ బెస్ట్ 2 ఓపెన‌ర్‌ గానూ రికార్డుల‌కెక్కింది. ఆ మేర‌కు తొలిరోజు లెక్క‌ల గుట్టు విప్పారు.

దేవ‌దాస్ చిత్రం డే1 లో ఏకంగా 12 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ నాగార్జున కెరీర్ టాప్ ఇదే. ఇక‌పోతే ఇందులో 7కోట్ల షేర్ వ‌సూళ్లు ఉన్నాయి. అలాగే ఈ సినిమా నాని కెరీర్ ఓపెనింగ్‌ ల్లో టాప్ 2 సినిమాగా రికార్డుల‌కెక్కింది. నాని న‌టించిన నేను లోక‌ల్ ఇప్ప‌టికి 15.5కోట్ల‌తో డే1లో టాప్ మూవీగా నిలిచింది. `నిన్ను కోరి` డే1 ఏకంగా 10.20 కోట్లు వసూలు చేసింది. నేను లోక‌ల్ 9.70కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇప్ప‌టికి దేవ‌దాస్ నాని కెరీర్ సెకండ్ బెస్ట్ ఓపెన‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా ఓవ‌రాల్‌గా 38 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది. అంటే తొలివారంలోనే మ‌రో 30 కోట్ల షేర్ వ‌సూలు చేయాల్సి ఉంది.

`దేవ‌దాస్` ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్ ప‌రిశీలిస్తే.. నైజాం 11.10కోట్ల‌కు హ‌క్కులు విక్ర‌యిస్తే డే1లో 1.45కోట్లు వ‌సూలైంది. సీడెడ్ 5.05 కోట్ల‌కు అమ్మితే డే1లో 73ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. వైజాగ్ 3.35కోట్ల‌కు విక్ర‌యిస్తే - తొలిరోజు 58ల‌క్షలు వ‌సూలైంది. తూ.గో జిల్లా 2.40కోట్లకు అమ్మితే 39ల‌క్ష‌లు - ప‌.గో జిల్లా 1.95కోట్ల‌కు అమ్మితే 26ల‌క్ష‌లు వ‌సూలైంది. కృష్ణ‌- 33ల‌క్ష‌లు - గుంటూరు 53ల‌క్ష‌లు - నెల్లూరు 19ల‌క్ష‌లు వ‌సూలైంది. ఏపీ తెలంగాణ ఓవ‌రాల్‌ గా 30.15కోట్ల మేర బిజినెస్ చేస్తే తొలిరోజు 4.56 కోట్ల షేర్ వ‌సూలైంది. ఓవ‌ర్సీస్ 5.05కోట్ల‌కు హ‌క్కులు కొనుక్కున్నారు. అక్క‌డ డే1లో 75ల‌క్ష‌లు వ‌సూలైంది. క‌ర్నాట‌క 2.05కోట్ల‌కు అమ్మితే - తొలిరోజే 1.20కోట్లు వ‌సూల‌వ్వ‌డం విశేషం. ఓవ‌రాల్‌ గా దేవ‌దాస్ తొలిరోజు ఫ‌లితం సంతృప్తిక‌రం. అయితే ఇదే తీరుగా 75శాతం ఆక్యుపెన్సీతో తొలి వారం అంతా ర‌న్ అయితేనే సినిమా సేఫ్‌ జోన్‌ కి చేరుకోగ‌ల‌దు.