Begin typing your search above and press return to search.
దేవదాస్ ముందు ఎవరెస్ట్ టార్గెట్
By: Tupaki Desk | 23 Sep 2018 8:05 AM GMTమరో నాలుగు రోజుల్లో వెండితెరపై సందడి చేయబోతున్న నాగార్జున నానిల మల్టీ స్టారర్ దేవదాస్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడని కారణంగా దీని మీద అంచనాలు మాములుగా లేవు. ట్రైలర్ కూడా ఆసక్తి రేపెలా యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ సమపాళ్ళలో కలిసినట్టుగా చూపడంతో అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి. అదే రోజు మణిరత్నం నవాబ్ పోటీలో ఉన్నా అందులో ఉన్న వాళ్ళందరూ తమిళ మొహాలు కావడంతో అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చని అభిమానుల ధీమా. అదలా ఉంచితే దేవదాస్ మీద ప్రీ రిలీజ్ లో భారీ పెట్టుబడులు పెట్టారు బయ్యర్లు. క్రేజీ మల్టీ స్టారర్ కావడం అందులోనూ ఇద్దరు మొదటిసారి కలిసి నటించడం లాంటివి దీనికి దోహదం చేశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు సుమారు 37 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్. ఇందులో డిజిటిల్ శాటిలైట్ లాంటి హక్కుల్ని కలపలేదు. అంటే బడ్జెట్ ప్రకారం చూసుకున్నా నిర్మాత అశ్వనీదత్ దీని ద్వారానే సేఫ్ అయినట్టు చెప్పొచ్చు. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే దేవదాస్ పెద్ద టార్గెట్లు పెట్టుకున్నాడు
నైజామ్ నుంచి 11 కోట్ల దాకా నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కింద డీల్ కుదరగా అదే పద్దతిలో సీడెడ్ నుంచి 5 కోట్ల ధర పలికింది. ఆంధ్ర ప్రాంతానికి 14 కోట్ల దాకా లెక్క తేలిందట. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 30 కోట్ల దాకా డీల్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ హక్కులను 4 కోట్ల 50 లక్షలకు విక్రయించగా రెస్ట్ అఫ్ ఇండియాలో భాగంగా మిగిలిన రాష్ట్రాలకు 2 కోట్ల 70 లక్షల అవుట్ రైట్ కు అమ్మేసినట్టు తెలిసింది. సో దేవదాస్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవాలంటే 37 కోట్ల షేర్ దాటాల్సిందే. నాగార్జున నాని ఇద్దరికీ వ్యక్తిగతంగా అంత బిజినెస్ చేసిన సినిమాలు సోగ్గాడే చిన్ని నాయన ఎంసీఏ చెరొకటి ఉన్నాయి. సో పాజిటివ్ టాక్ వస్తే కనక ఇప్పుడు పెట్టిన పెట్టుబడిని వెనక్కు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ చాలా బాగుంది అనే మాట బయటికి రావాలి. సో దేవదాస్ ఈ మౌంట్ ఎవరెస్ట్ అంత ఉన్న టార్గెట్ ని రీచ్ కావడం పెద్ద టాస్కే. శైలజారెడ్డి అల్లుడు సందడి తగ్గడంతో పాటు మొన్న వచ్చిన నన్ను దోచుకుందువటే మాస్ టార్గెట్ చేసింది కాకపోవడంతో పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నా దేవదాస్ కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా అంచనాలు అందుకోవడమే.