Begin typing your search above and press return to search.
నాగ్ సారు ఈసారికి అలా కానిచ్చారట!
By: Tupaki Desk | 12 Sep 2018 11:49 AM GMTఅక్కినేని నాగార్జున - నాని కలిసి నటిస్తున్న మల్టి స్టారర్ మూవీ 'దేవదాస్'. ఈ సినిమా షూటింగ్ నిన్నే పూర్తయింది. నాగార్జున తన ట్విట్టర్ ఖాతాల ద్వారా షూటింగ్ పూర్తయిందనే విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ట్వీట్ తో పాటుగా సెల్ఫీ ని పోస్ట్ చేశాడు. మరో వైపు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కూడా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.
మరి ఇంత క్లియర్ గా సినిమా షూటింగ్ అయిపోయిందని చెప్తూ ఉంటే నాగార్జున 'దేవదాస్' సినిమా కు రీషూట్స్ సూచించాడని అంటున్న వార్తల మాటేమిటి? సహజంగా నాగార్జున పనిచేసే సినిమాలు లేదా అఖిల్ - చైతు ల సినిమాలకు ఫైనల్ వెర్షన్ చూసిన తర్వాత మార్పుచేర్పులు చెప్పడం అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సిక్రెట్. మరి ఈ సినిమా ఎలా నాగ్ దృష్టి నుండి తప్పించుకుంది? రీ షూట్స్ లేనట్టేనా.. జరగనట్టేనా?
అదే అక్కడే లాజిక్కుంది. జరిగాయి కానీ పూర్తిగా షూటింగ్ అయిపోయిన తర్వాత మార్పు చేర్పులు చెప్పకుండా ఎప్పటికప్పుడు చెప్పడం.. శ్రీరాం ఆదిత్య అప్పటికప్పుడు వాటిని సరిచేయడం జరిగిందట. దీంతో సినిమా షూటింగ్ తో పాటే రీషూట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అంటే నాగ్ సారూ ఈ సారికి అలా కానిచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చలాకీతనం. నాగ్ సార్ కి తగ్గట్టే నడుచుకోవడం. దానికి తోడు రీషూట్లు కూడా ఒకేసారి చేసేయడం. మిగతా డైరెక్టర్లు కూడా ఈ టెక్నిక్ ఫాలో కావొచ్చేమో!