Begin typing your search above and press return to search.
'ప్రస్థానం'లో ఆయనకి స్థానమే లేదంట...!
By: Tupaki Desk | 17 April 2020 6:30 PM GMTదేవా కట్ట దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ప్రస్థానం'. తెలుగులో వచ్చిన అత్యుత్తమ పొలిటికల్ డ్రామాల్లో 'ప్రస్థానం' ఒకటనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో సాయికుమార్, సందీప్ కిషన్, రేష్మీ గౌతమ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ఓవైపు శర్వానంద్ మరోవైపు సాయికుమార్ అద్భుతంగా నటించి మెప్పించారు. అలాంటి నటుల మధ్య కొత్త నటుడు సందీప్ కిషన్ కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. నెగెటివ్ క్యారెక్టర్లో సందీప్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఇప్పటి వరకు హీరో పాత్రలతోనూ రాని పేరు ఆ క్యారెక్టర్‌తో సంపాదించాడు సందీప్. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు సందీప్ పదేళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా దేవా కట్టా సందీప్‌ను విష్ చేస్తూ అతను 'ప్రస్థానం' సినిమాలోకి ఎలా వచ్చాడో వివరించాడు. ముందు అసలు 'ప్రస్థానం'లో సందీప్ భాగమే కాదని అతను వెల్లడించాడు.
దేవ కట్టా మాట్లాడుతూ.. 'ప్రస్థానం' సినిమా కోసం ముందుగా సందీప్ కిషన్ ను అనుకోలేదు. సందీప్ కిషన్ పోషించిన పాత్రకి ముందుగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని తీసుకున్నాము. మరో రెండు వారాలలో షూటింగు మొదలవుతుందనగా, వ్యక్తిగత కారణాల వలన అతను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సందీప్ కిషన్ ను శర్వానంద్ పరిచయం చేశాడు. సందీప్ కిషన్ ఆడిషన్స్ లో తన నటనతో మెప్పించాడు. ఆ పాత్రను ఓన్ చేసుకుని ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా షూటింగ్ టైంలో పాత్రకు ఎలా మెరుగులు దిద్దాలి.. ఇంకా ఏం చేయొచ్చు అని ఒక దర్శకుడి తరహాలో ఆలోచిస్తూ తనను తాను మౌల్డ్ చేసుకుని నటించి తన మీద సందీప్ భారం తగ్గించాడని సందీప్ ని మెచ్చుకున్నాడు. అనుకోకుండా వచ్చి పడిన ఈ 'ప్రస్థానం' సందీప్ కిషన్ సినీ ప్రస్థానానికి ఎంత మేలు చేసిందో తెలిసిందే.