Begin typing your search above and press return to search.

క‌శ్మీర్ లో దేవ‌ర‌కొండ బర్త్ డే హంగామా!

By:  Tupaki Desk   |   9 May 2022 4:34 AM GMT
క‌శ్మీర్ లో దేవ‌ర‌కొండ బర్త్ డే హంగామా!
X
రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు కావ‌డంతో నిన్న సాయంత్రం నుంచే బ‌ర్త్ డే జోరు మొద‌లైంది. 'లైగ‌ర్'..'జ‌న‌గ‌ణ‌మ‌న' టీమ్ రౌడీబోయ్ కి త‌మ‌దైన శైలిలో విషెస్ తెలియ‌జేసింది. విజ‌య్ మ్యాన్లీ లుక్ రివీల్ చేసి బ‌ర్త్ డే బోయ్ కి బిగ్ ట్రీట్ ఇచ్చింది. అదే పోస్ట‌ర్ ని స‌మంత ట్విట‌ర్లో షేర్ చేసి విషెస్ తెలియ‌జేసింది.

అయితే నిన్న‌టి వ‌ర‌కూ విజ‌య్ హైద‌రాబాద్ లో ఉన్నాడా? పూరి టీమ్ తో ఉన్నాడా? అన్న‌ది క్లారిటీ లేదు. వి.డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ స్పాట్ ఎక్క‌డ‌వుతుంద‌న్న‌ది తెలియ‌లేదు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న 11వ సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం క‌శ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

విజ‌య్ తో పాటు స‌మంత‌..చిత్ర నిర్మాత‌ స్పాట్ లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిన్న‌టి రాత్రి నిర్మాత‌లు విజ‌య్ బ‌ర్డ్ డే సెలబ్రేష‌న్స్ గ్రాండ్ గా నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తుంది. సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. చిత్ర నిర్మాత వై.వి ర‌విశంక‌ర్..స‌మంత‌...శివ నిర్వాణ‌..విజ‌య్ అంతా క‌లిసి దిగిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విజ‌య్ బ్లాక్ టీష‌ర్ట్..బ్లూజీన్స్ ధ‌రించ‌గా.. స‌మంత క్యాజువ‌ల్ వేర్స్ లో క‌నిపిస్తున్నారు. విజ‌య్ లుక్ పూర్తి డీసెంట్ గా శివ మార్క్ హీరోలా క‌నిపిస్తుంది. 'లైగ‌ర్' కోసం పూరి ర‌క‌ర‌కాల గెట‌ప్స్ వేయించారు. ఆ పాత్ర నుంచి విజ‌య్ పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసాడు. 'గీత గోవిందం' హీరోలా స్మార్ట్ గా త‌యార‌య్యాడు.

మ‌రి శివ ఎంపిక చేసుకున్న స్ర్కిప్ట్ ఏంటి? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ శివ నిర్వాణ సినిమాల‌న్నీ ల‌వ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లోనే సాగాయి. వాటికి మంచి స‌క్సెస్ రేట్ ఉంది. ఆజోన్ దాటొచ్చి చేసిన చివ‌రి సినిమా ట‌క్ జ‌గ‌దీష్ ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో వీడీ 11 ఎలా ఉండ‌బోతుంది? అన్న ఆస‌క్తి మొద‌లైంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స‌ల్ నిర్ల‌మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ అనంత‌రం పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న 'జ‌న‌గ‌ణ‌మ‌న' షూట్ లో జాయిన్ కానున్నాడు. ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీ. క‌శ్మీర్ లోనే కీల‌క షెడ్యూల్స్ చేసే అవ‌కాశం ఉంది.