Begin typing your search above and press return to search.

16M సాక్షిగా స్టార్ హీరో కూతురి ప్రేమ‌లో రౌడీ బోయ్?

By:  Tupaki Desk   |   14 July 2022 5:30 AM
16M సాక్షిగా స్టార్ హీరో కూతురి ప్రేమ‌లో రౌడీ బోయ్?
X
సోషల్ మీడియాలు స్టార్ల రేంజును నిర్ధేశిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేదిక‌పై ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ని ఎలివేట్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో 16 మిలియ‌న్ల క్ల‌బ్ లో చేరాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇది నిజంగా ఒక వండరేన‌ని చెప్పాలి. నేటిత‌రం హీరోల్లో ఎవ‌రికీ లేనంత గా కోటిన్న‌ర మంది పైగా ఫాలోవ‌ర్స్ తో అత‌డు సంచ‌ల‌నంగా మారాడు. రౌడీ బోయ్ గా మ‌గువ‌ల గుండెల‌ను దోచిన దేవ‌ర‌కొండ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా స‌త్తా చాలాల‌ని క‌ల‌లు కంటున్నాడు. ఓ వైపు పూరీతో లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ ముగించి త‌దుప‌రి చిత్రీక‌ర‌ణ‌ల కోసం ప్రిప‌రేష‌న్‌ లో ఉన్న‌ రౌడీ బోయ్ త‌దుప‌రి కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 లో సంద‌డి చేయ‌బోతున్నాడు.

ఇంత‌లోనే దేవ‌ర‌కొండ‌తో డేటింగ్ చేయాలనుంద‌న్న‌ సారా అలీ ఖాన్ 'కాఫీ విత్ క‌ర‌ణ్ షో'లో వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ వ్యాఖ్యపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందించాడు. విజయ్ బాలీవుడ్ లో లైగ‌ర్ సినిమాతో అరంగేట్రం చేయబోతున్నాడు. అదే క్ర‌మంలో లైగ‌ర్ నిర్మాత కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ త‌దుప‌రి ఎపిసోడ్ లో సారా అలీ ఖాన్ - జాన్వీ కపూర్ గెస్ట్ లుగా షూట్ లో పాల్గొన్నారు. ఇటీవ‌ల‌ విడుదలైన ఎపిసోడ్‌ ప్రోమోలో పరిశ్రమలో ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అని సారాను అడిగినప్పుడు.. ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. సారా వ్యాఖ్యకు విజయ్ రిప్లై ఇచ్చాడు. 'క్యూటెస్ట్' అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

కాఫీ విత్ క‌ర‌ణ్ ప్రోమోలో ''సారా మీరు డేటింగ్ చేయాలనుకుంటున్నారని భావిస్తున్న అబ్బాయి పేరు చెప్పండి'' అని క‌ర‌ణ్ అడిగాడు. మొదట సారా వెల్లడించడానికి నిరాకరించింది. తరువాత అస్పష్టంగా 'విజయ్ దేవరకొండ' అని అంది. ఇదే ప్రోమోను షేర్ చేస్తూ విజ‌య్ ''మీరు 'దేవరకొండ' అని చెప్పే విధానం నాకు చాలా ఇష్టం. బిగ్ హ‌గ్స్.. ప్రేమ‌.. నా ఆప్యాయత (హృదయ ఎమోజి) పంపుతున్నాను'' అని వ్యాఖ్యానించాడు.

విజ‌య్ ఎంతో ప‌రిప‌క్వ‌త‌తో స్పందించినా కానీ...అభిమానులు మాత్రం త‌న‌లోని ప్రేమ‌ను దాచుకోలేక‌పోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సారాతో విజ‌య్ ఎంతో స్నేహంగా ఉంటున్నాడు. జాన్వీ తోనూ అంతే క్లోజ్ గా ఉన్నాడు. కియ‌రా.. అన‌న్య‌ల‌తో క‌లిసి ప్ర‌క‌ట‌న‌లోనే న‌టించేశాడు. కాబట్టి ఆ న‌లుగురిలో ఎవ‌రో ఒక‌రికి విజ‌య్ క‌మిట‌వ్వాల‌ని కూడా కొందరు సూచిస్తున్నారు.

విజయ్ లైగ‌ర్ చిత్రంలో అనన్య పాండే క‌థానాయిక‌గా న‌టించింది. అన‌న్య‌తో అత‌డి కెమిస్ట్రీ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంద‌ని ల‌క్ డీ ప‌క్ డీ పాట రివీల్ చేసింది. హిందీ- తమిళం- తెలుగు సహా ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంతో మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ భార‌త‌సినీప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతున్నారు.

సారా ఇద్ద‌రితో ముగ్గురితో డేటింగ్

కాఫీ విత్ కరణ్ మునుపటి సీజన్ లోని ఒక ఎపిసోడ్ లో సారా తనకు కార్తీక్ ఆర్యన్ పై క్రష్ ఉందని చెప్పింది. తరువాత వారిద్దరూ లవ్ ఆజ్ కల్ లో కనిపించారు. తరచుగా కలిసి కనిపించారు కానీ వారు నిజంగా డేటింగ్ చేస్తున్నారో లేదో వారు ఎప్పుడూ వెల్లడించలేదు. అయితే ఇటీవల కరణ్ జోహార్ ఒక ఇంటర్వ్యూలో సారా - కార్తీక్ ఒకరికొకరు డేటింగ్ చేసినట్లు ధృవీకరించారు. సారా ఇంత‌కుముందు సుశాంత్ సింగ్ తోనూ కొద్దిరోజుల పాటు డేటింగ్ చేశాన‌ని అంగీక‌రించింది. ఇప్పుడు దేవ‌ర‌కొండ అంటే ప్రేమ అని గారాలు పోతోంది.