Begin typing your search above and press return to search.
దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ ఏ ఇతర స్టార్ కి తగ్గదు!
By: Tupaki Desk | 19 July 2021 10:36 AM GMTవిజయ్ దేవరకొండ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం LIGER (సాలా క్రాస్‌బ్రీడ్). పూరి జగన్నాథ్ దర్శకుడు. మహమ్మారీ కల్లోలం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా నటిస్తున్నారు. అవసరం మేర విజయ్ మార్షల్ విద్యల్లో శిక్షణ పొందారు. విజయ్ లుక్ ఇప్పటికే మారింది. అతడు పూర్తిగా కొత్త రూపంతో అలరించనున్నారు.
ఇందులో బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే తో దేవరకొండ రొమాన్స్ చేస్తున్నారు. విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ -ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్- చార్మి కౌర్- కరణ్ జోహార్ - అపుర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ- తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ భాషలలో రూపొందుతున్న లైగర్ లో రమ్య కృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఇప్పటివరకూ చిత్రీకరించిన ఫుటేజ్ నుంచి కొన్ని లీకుల్ని అందించారు ఆర్జీవీ. గడిచిన రెండు దశాబ్ధాల కాలంలో నేను చూసిన ఏ ఇతర స్టార్ కి తగ్గని రీతిలో విజయ్ దేవరకొండ లైగర్ లో కనిపించాడని ఆర్జీవీ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు... టైగర్ - లయన్ మధ్య సూపర్ క్రాస్ బ్రీడ్ అతడు అంటూ పొగిడేయడం ఆసక్తిని రేకెత్తించింది. కొన్ని సీన్లు చూసి ఆర్జీవీ ఆ రేంజులో పొగిడేశారు. ఒకవేళ పూర్తి మూవీలో విజయ్ ని పూరి ఏ రేంజులో చూపించి ఉంటారో దీనిని బట్టి ఊహంచవచ్చు.
పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన విజయ్ దేవరకొండ లైగర్ విజయంపై ఎంతో ధీమాగా ఉన్నారు. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత అండదండలు అతడికి పెద్ద ప్లస్ కానున్నాయి. ఇక ఔట్ సైడర్స్ కి అవకాశం ఇవ్వరన్న అపప్రదను ఎదుర్కొంటున్న కరణ్ దానిని తుడిచేసేందుకు ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి బాలీవుడ్ ఔట్ సైడర్స్ కి అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసే వ్యూహం అనుసరిస్తున్నారని ఒక సెక్షన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
లైగర్ కి పోటీ రిలీజ్..!
లైగర్ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రచారంలో హైప్ బావుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడంతో ఈ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు లైగర్ చిత్రంతో పోటీగా వరుణ్ తేజ్ గని రిలీజ్ కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్స్ పరంగా చూసుకుంటే `గని` సినిమాకి అధిక థియేటర్లు దొరికే ఛాన్స్ ఉందని టాక్ అయితే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు పూరి ప్రొడెక్ట్ అంటే విపరీతమైన నమ్మకం. పూరి బ్రాండ్ మీదనే ఎన్నోసార్లు ఆయన సినిమాలు మార్కెట్ అయ్యాయి.
హీరో ఇమేజ్ తో పని లేకుండా పూరి బ్రాండ్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు బయ్యర్లు. ఆ రకంగా లైగర్ కు తెలుగులో ప్రధానంగా కలిసొచ్చే అంశమిది. మరి అంతిమంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలంటే చివరిగా కంటెంట్ తో కొట్టాల్సిందే. లైగర్ పాన్ ఇండియా టార్గెట్ కాబట్టి ఇంకా ఎక్కువ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. లైగర్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో మాస్ యాక్షన్ చిత్రం కాగా గని చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీ. ఇవి రెండూ మాస్ ని టార్గెట్ చేస్తున్నాయి కాబట్టి భారీ వసూళ్లను సాధించే వీలుంటుందనడంలో సందేహమేం లేదు.