Begin typing your search above and press return to search.

దేవరకొండ పాన్ ఇండియా డ్రీమ్.. అతడే దిక్కు!

By:  Tupaki Desk   |   3 Sep 2022 11:30 PM GMT
దేవరకొండ పాన్ ఇండియా డ్రీమ్.. అతడే దిక్కు!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలని అనుకున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై అతను పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. తప్పకుండా పూరి కంటెంట్ మ్యాజిక్ క్రియేట్ చేయగలదు అని ఆశలు పెట్టుకుంటే విడుదల తర్వాత ఒక్కసారిగా అంచబలు రివర్స్ అయ్యాయి.

అసలైతే విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డు ఇటీవల కాలంలో డిజాస్టర్ ట్రాక్లో వెళ్తున్నప్పటికీ కూడా లైగర్ సినిమాకు మంచి హైప్ అయితే పెరిగింది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది.. కాబట్టి దేవరకొండ తన శక్తిని అంతా ఈ సినిమా కోసం ధారపోశాడు. కానీ పూరి జగన్నాథ్ రొటీన్ మేకింగ్ తో డిజాస్టర్ అందుకోక తప్పలేదు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ వరకు వెళ్లాలంటే అతనికి ఉన్న ఒకే ఒక్క దిక్కు సుకుమార్ అనే చెప్పాలి.

సుకుమార్ తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు గత ఏడాదిలోనే విజయ్ క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ముందుగా సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా రావడానికి మరో ఏడాది పట్టిన ఆ తరువాత మళ్లీ సుకుమార్ మరో ఏడాది వరకు దేవరకొండ ప్రాజెక్టు స్క్రిప్ట్ కోసం టైమ్ తీసుకోవచ్చు.

ఇక షూటింగ్ స్టార్ట్ చేసినా ఏడాది పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో దాదాపు మూడేళ్ళ తరువాత గాని విజయ్ దేవరకొండ నుంచి నమ్మకమైన పాన్ ఇండియా సినిమా వచ్చే అవకాశం లేదు. అంతేకాకుండా సుకుమార్ లిస్టులో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. అది ముందు వచ్చినా రావచ్చు.

ఇక దేవరకొండ లైగర్ తో సక్సెస్ అందుకుంటే సుకుమార్ చేయబోయే ప్రాజెక్టుకు ఎంతో కొంత హెల్ప్ అయ్యేదే. కానీ విజయ్ అంచనాలు రివర్స్ అయ్యాయి. మరి సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ తో సక్సెస్ అందుకొని విజయ్ తో పాన్ ఇండియా సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో కాలమే సమాధానం చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.