Begin typing your search above and press return to search.

ట్యూన్ వీడియో: ప్రభుదేవా ప్రేమికుడి మార్క్

By:  Tupaki Desk   |   22 Feb 2019 1:10 PM GMT
ట్యూన్ వీడియో: ప్రభుదేవా ప్రేమికుడి మార్క్
X
మూడేళ్ళ క్రితం డాన్స్ సెన్సేషన్ ప్రభుదేవా-మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా వచ్చిన అభిసారిక మంచి విజయం సాధించిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. హారర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ తమిళ్ లో దేవి పేరుతో రూపొందింది. అందులో తమన్నా రెండు షేడ్స్ లో చేసిన పాత్రకు మంచి అప్లోజ్ వచ్చింది. ఓ పాటలో తమన్నా డాన్స్ కు మరో గీతంలో ప్రభుదేవా స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది.

దేవి 2 పేరుతో రూపొందుతున్న ఈ మూవీ దానికి కొనసాగింపుగానే ఉంటుంది. దీనికీ విజయే దర్శకుడు. కోవై సరళ కీలక పాత్ర చేస్తోంది. దీనికి సంబంధించిన ట్యూన్ ప్రోమో వీడియో ఒకటి విడుదల చేసింది టీమ్. సాధారణంగా లిరికల్ వీడియోస్ వదలటం పరిపాటి. అయితే ఈ ట్రెండ్ కి భిన్నంగా యూనిట్ కొత్తగా ఆలోచించి దానికి బదులు రాబోయే పాట ట్యూన్ మాత్రం వీడియో రూపంలో రిలీజ్ చేసింది

ఇందులో ప్రభుదేవా సైలెంట్ కిల్లింగ్ స్టెప్స్ తమన్నా విచిత్ర హావభావాలు సినిమాలో భాగమైన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరూ ఆ ట్యూన్ ని హమ్ చేస్తూ ఉండటం అంతా వెరైటీగా ఉంది. సామ్ సిఎస్ దీనికి సంగీత దర్శకుడు. విక్రమ్ వేదాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న సామ్ దీనికి కూల్ మెలోడీ సెట్ చేసాడు. తమిళ్ అర్థం కాకపోయినా క్యాచీగా చూడబుద్ది అయ్యేలా వీడియోని కట్ చేసిన తీరు అభిమానులను అలరిస్తోంది. తెలుగులో అభిసారిక 2తో డబ్ చేస్తారో లేక దేవి 2 అంటారో ఎవరైనా నిర్మాతలు హక్కులు కొనుగోలు చేసాక తెలుస్తుంది. వయసు పెరుగుతున్నా తన డాన్స్ లో గ్రేస్ ఏ మాత్రం తగ్గని ప్రభుదేవా కోసమే ఈ సినిమా చూసేవాళ్ళే ఎక్కువ. మిల్కీ అందాలు అదనం. సమ్మర్ లో దేవి 2 రిలీజయ్యే అవకాశం ఉంది