Begin typing your search above and press return to search.
దాసరికి టీవీ9 దేవి మనవరాలు
By: Tupaki Desk | 26 Sep 2020 3:30 AM GMTతెలుగు బిగ్ బాస్ కు మొదటి లేడీ విజేతగా నిలుస్తానంటూ చాలా నమ్మకంగా హౌస్ లోకి వెళ్లిన దేవి నాగవల్లి కేవలం ఆర్థిక అవసరాల కోసం బిగ్ బాస్ విన్నర్ అవ్వాలనుకుంటున్నట్లుగా పేర్కొంది. చాలా సీరియస్ గా సందర్బానుసారంగా స్పందిస్తూ తన అవసరం ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉంటూ దేవి బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ లా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 4 కంటెస్టెంట్స్ లో ఖచ్చితంగా ఆమె ఉంటుందేమో అంటూ ఇప్పటి నుండి ఆమెపై చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు. దేవి తల్లిగారు తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ దేవి ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేసింది. ఇంట్లో ఎలా అయితే పోరాడిందో ఇప్పుడు అక్కడ కూడా అలాగే పోరాటం చేస్తుందన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. నా కూతురు దేవి నాగవల్లి ఇంట్లో ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉంటుంది. వాళ్ల నాన్న 2000వ సంవత్సరంలో చనిపోయిన సమయంలో కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుంది. ఆమె అన్నయ్య మరియు తమ్మడు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు అంటే ఆమె వల్లే. కుటుంబ బాధ్యత మొత్తం తనే మోస్తుంది. కొడుకులు, కోడల్లు, మనవల్లు, దేవి నేను అంతా కలిసే ఉంటాం. మాది రాజమండ్రి మాకు దాసరి నారాయణ రావుగారి కుటుంబంతో బంధుత్వం ఉంది.
దేవి నాన్న గారికి దాసరి నారాయణ రావు మేనమామ అవుతారు. అంటే దాసరి నారాయణ రావు గారు దేవికి తాత వరుస అన్నట్లు. ఆయన పేరును ఎప్పుడు ఎక్కడ కూడా మేము వాడుకోలేదు. ఆయన నుండి అప్పుడు ఎప్పుడు కూడా సాయం పొందలేదు. ఆయన పాలకొల్లు వచ్చినప్పుడు తరుచు కలుస్తూ ఉండేవాళ్లం. వారింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వెళ్తూ ఉండేవాళ్లం. నా కూతురు కాలేజ్ డేస్ లో మంచి క్రికెటర్. ఎన్నో అవార్డులు మరియు బహుమానాలు పొందింది. తను ఎన్నో బాధలు పడి ఈస్థాయికి వచ్చింది. తప్పకుండా ఆమెలోని పట్టుదల విజేతగా నిలుపుతుంది. దేవికి గట్టి పోటీ అంటే నోయల్ అనుకుంటున్నాను. మిగిలిన అంతా కూడా బాగా ఆడుతున్నారు అంటూ తన కూతురు బిగ్ బాస్ షో పై పూర్తి సంతృప్తిని ఆమె వ్యక్తం చేశారు.