Begin typing your search above and press return to search.
ఆసక్తి రేకెత్తిస్తున్న 'దేవి'
By: Tupaki Desk | 26 Feb 2020 4:30 AM GMTకొన్ని రోజుల క్రితం హిందీ షార్ట్ ఫిల్మ్ ‘దేవి’ గురించి మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. కాజల్.. శృతిహాసన్.. నేహా ధూపియాలతో పాటు ఇంకా పలువురు ముఖ్య తారాగణం నటించిన దేవి షార్ట్ ఫిల్మ్ అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ చూడగానే చాలా మంది షార్ట్ ఫిల్మ్ పై ఆసక్తి కనబర్చారు. కొందరు మాత్రం లైట్ తీసుకున్నారు. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోతో షార్ట్ ఫిల్మ్ ను మార్చి 2న విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటించారు.
9 మంది ఆడవారు ఒక్క రూంలో ఏదో కారణం చేత ఉండాల్సి వస్తుంది. ఆ 9 మంది కూడా విభిన్న వయసుల వారు విభిన్న మనస్థత్వాల వారు. అందరు ఆడవారే అవ్వడం అందరిలో ఆసక్తి రేకెత్తుతుంది. టీజర్ లో షార్ట్ ఫిల్మ్ మెయిన్ స్టోరీ లైన్ ను రివీల్ చేయలేదు కాని ఒక రూంలో 9 మంది ఆడవారు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.
టీజర్ విడుదల తర్వాత అసలు దేవి ఏంటీ అని తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక లేడీ ఈ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించడంతో పాటు 9 మంది లేడీస్ ముఖ్య పాత్రల్లో ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఈ 9 మంది ఆడవారికి కూడా మార్గదర్శిగా ఉంటుంని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. మహిళ శక్తిని.. మహిళల గొప్పతనంను చూపించే విధంగా ఉంటుందని అంతా నమ్ముతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.