Begin typing your search above and press return to search.
చలించిన దేవిశ్రీ ప్రసాద్.. వారికోసం ముందడుగు
By: Tupaki Desk | 3 Aug 2021 8:31 AM GMTగొప్పతనం వేరు.. మంచి తనం వేరు. అయితే.. అవి రెండూ తనలో ఉన్నాయని చాటుకున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్. ఆగస్టు 2వ తేదీ ఆయన పుట్టిన రోజు. ఈ అకేషన్ సందర్భంగా.. టాలీవుడ్ ప్రముఖులంతా డీఎస్పీకి గ్రీటింగ్స్ చెప్పారు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తో ముంచెత్తారు. అయితే.. సెలబ్రిటీలుగా ఉన్నవారంతా స్టార్ హోటల్స్ లో గ్రాండ్ గా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ.. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం అనాథ బాలల మధ్యలో తన పుట్టిన రోజును జరుపుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గన్నవరంలో ఆయన తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. గన్నవరంలోని ‘డ్యాడీస్ హోమ్’లో ఉన్న అనాథ చిన్నారుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆడిపాడారు. వారిలో కలిసిపోయి పాటలు పాడుకున్నారు. వారిని ఎత్తుకొని ఆనందించారు. ఈ సందర్భంగా.. వారి పరిస్థితిని చూసి చలించిపోయారు. అమ్మానాన్నలేని వారి ఇబ్బందులను చూసి జాలిపడ్డారు. అందుకే.. వారికి ఏదోవిధంగా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు.. ఈ నెల మొత్తం ఆ హోమ్ లో ఉన్న చిన్నారులకు కావాల్సిన సరుకులన్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు డీఎస్పీ. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘మీ ప్రేమాభిమానాలకు ఇదే నా వందనం. నా బర్త్ డే సందర్భంగా మీకో విషయం చెప్పాలని అనుకుంటున్నాను. గన్నవరంలో డ్యాడీస్ హోమ్ అని ఒక అనాథాశ్రమం ఉంది. ఇది తల్లిదండ్రులు లేని వందలాది మంది చిన్నారుల బాగోగులు చూసుకుంటుంది. ఈ చిన్నారులపై వారు చూపించే వ్రద్ధ, నిస్వార్థ సేవ నా మనసును తాకింది. గతంలో సర్ ప్రైజ్ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా.. వాళ్ల కోసం నేను సంగీతం వాయించాను. అప్పటి నుంచి వాళ్లతో కనెక్ట్ అయిపోయాను. ఈ ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నా. అలాగే అందరికీ ఈ నెలకు సరిపడా సరుకులు అందిస్తాను’’ అని రాశారు దేవీశ్రీ ప్రసాద్.