Begin typing your search above and press return to search.
మా అమ్మ కష్టం అలాంటిలాంటిది కాదు-దేవిశ్రీ
By: Tupaki Desk | 27 Jan 2016 4:02 AM GMTదేవిశ్రీ ప్రసాద్ అంటే ఓ ఎనర్జీ.. ఓ ఉత్సాహం.. అతణ్ని చూడగానే మనలో కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ.. తాను ఉన్న ప్రతిచోటా సందడి వాతావరణం తెస్తూ చాలా ఉత్సాహంగా ఉంటాడు దేవి. కానీ గత నెలన్నర రోజులుగా అతణ్ని చాలా కొత్తగా చూస్తున్నాం. తాను ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయాక డల్ అయిపోయాడు దేవి. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ కనిపించే దేవి.. పొగిలి పొగిలి ఏడుస్తుండగా చూడటం జనాలకు కొత్తగా అనిపించింది. ఐతే తండ్రి మరణం తాలూకు బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు దేవి. తన తండ్రి పోయిన నేపథ్యంలో అందరూ ఆయన గొప్పదనం గురించి.. ఆయనతో తన అనుబంధం గురించి చాలా చెప్పుకుంటున్నారని.. ఐతే ఈ సందర్భంలో తాను తన తల్లి గురించి కూడా మాట్లాడి తీరాలని చెబుతూ ఆమె తమ కోసం చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకున్నాడు దేవి.
‘‘మేం స్కూల్లో చదువుకునే టైంలో నాన్న గారికి తొలిసారి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పట్నుంచి ఆయన అనారోగ్యంతో పోరాడుతూనే ఉన్నారు. ఐతే అప్పటికి మేం చెన్నైకి కొత్త. ఎవ్వరూ బంధువులు లేరు. తెలిసినవాళ్లు లేరు. ఆ టైంలో మా అమ్మ పడ్డ బాధ వర్ణనాతీతం. ముందు మమ్మల్ని తయారు చేసి స్కూల్లో వదిలేది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి నాన్నను చూసుకునేది. మా అమ్మకప్పుడు డ్రైవింగ్ కూడా తెలియదు. నాన్నే కారు నడిపేవారు. ఐతే మా నాన్న అనారోగ్యం పాలయ్యాక ఆమె డ్రైవింగ్ స్కూలుకెళ్లి డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆమే మమ్మల్ని స్కూల్లో దింపుతూ.. నాన్నకు ఆసుపత్రికి కుడా తీసుకెళ్లేవారు. అందుకే మా నాన్న ఎప్పుడూ అంటుంటాడు. మా అమ్మకు నలుగురు పిల్లలని. ముగ్గురం మేమైతే.. నాలుగోవాడు మా నాన్న. ఇక నేను సంగీతం అందించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఆఖరు సన్నివేశం చూస్తే మా అమ్మకు నాన్నే గుర్తుకొచ్చాడు. చాలా ఉద్వేగానికి గురై ఏడ్చేసింది’’ అని వెల్లడించాడు దేవి.