Begin typing your search above and press return to search.
దేవిశ్రీ.. అతను.. కలిస్తే మెరుపులే
By: Tupaki Desk | 3 Jan 2016 5:30 PM GMTసినిమాల ద్వారా మంచి చెబితే జనాలు వింటారా అనుకుంటాం కానీ.. కేవలం సినిమాల ద్వారా జీవితాల్ని దిద్దుకున్న వాళ్లు ఎంతోమంది ఉంటారు. నైరాశ్యంలో ఉన్న వాళ్లు ఓ ఇన్ స్పైరింగ్ సాంగ్ విని డిప్రెషన్లోంచి బయటికి వచ్చిన సందర్భాలు కనిపిస్తుంటాయి. ‘మౌనంగానే ఎదగమని..’ లాంటి పాటలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ - రఘు దీక్షిత్ కలిసి తమ పాటలతో ఇలాగే జనాల్ని ఇన్ స్పైర్ చేస్తున్నారు. పెక్యులర్ వాయిస్ ఉన్న రఘు దీక్షిత్ ను తెలుగులోకి తీసుకొచ్చి అద్భుతమైన పాటలు పాడిస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్.
దేవి-రఘు కాంబినేషన్లో ముందుగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో వచ్చింది. అందులో ‘చల్ చలో చలో’ పాటను దేవిశ్రీ ఎంత బాగా కంపోజ్ చేశాడో.. రఘు దీక్షిత్ అంత బాగా పాడాడు. ‘‘కష్టాలెందుకు బరువుగుంటాయ్.. తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక.. కన్నీళ్లెందుకు ఉప్పగుంటాయ్.. తియ్యగుంటే ఎప్పటికీ వదలవు గనుకా’’ అంటూ స్ఫూర్తి నింపే లిరిక్స్ ఆ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’లో జాగోరే జాగో పాట కూడా జనాల్ని ఎంతగానో ఇన్ స్పైర్ చేసింది. అందులో రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ రాస్తే దేవిశ్రీ సంగీతం.. రఘు దీక్షిత్ గానం.. తోడై ఆ పాట సూపర్ హిట్టయింది. ఇప్పుడిక ‘నాన్నకు ప్రేమతో’లోనూ ఓ స్ఫూర్తిదాయక పాటతో ముందుకొచ్చింది దేవిశ్రీ, రఘు దీక్షిత్ జోడీ.
‘‘వాళ్ళు నిన్ను విసిరేసామాని అనుకోని అనుకోనీ... వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని బంతివని’’..‘‘ వాళ్ళు నిన్ను నరికేశామని అనుకోనీ.. వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని’’.. ‘‘వాళ్ళు నిన్ను పాతేసామని అనుకోని అనుకోనీ.. వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని’’.. ఇలాంటి స్ఫూర్తిదాయక లిరిక్స్ తో చంద్రబోస్ తన పెన్ పవర్ చూపిస్తే.. దేవిశ్రీ, రఘుదీక్షిత్ ఈ పాటను తమ ప్రతిభతో మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పటికే రెండు పాటలతో స్ఫూర్తి నింపిన దేవిశ్రీ-రఘు దీక్షిత్ జోడీ.. డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఎనఫ్ పాటతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.