Begin typing your search above and press return to search.
దేవీశ్రీ కొరియోగ్రఫీ .. రెండో కోణం
By: Tupaki Desk | 3 Oct 2015 1:30 PM GMTట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ లో ఎనర్జీ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇన్నేళ్ల కెరీర్ లో దేవీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఎన్నో చార్ట్ బస్టర్ హిట్స్ ని ఇచ్చిన సంగీతదర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇటీవలి కాలంలో విదేశీ టూర్ లతో భారీ స్టేజ్ షోలతో ఎన్నారైలను ఆకట్టుకున్నాడు. వేదికలు ఎక్కి ఆటా పాటా రెండిటినీ విజయవంతంగా అందించే సంగీతదర్శకుడిగా దేవీ పాపులర్ అయ్యాడు. ఓ హీరోకి ఉండాల్సినంత ఎనర్జీ దేవీలో ఉంది అంటే అతిశయోక్తి కాదు. అతడు నటిస్తానంటే హీరోని చేసే దర్శకనిర్మాతలు ఉన్నారు. అయినా దేవీ శ్రీ ఇంతకాలం హీరో అవ్వలేదు. రొటీనిటీ అనేది ఇబ్బంది అనిపించిందో, లేక ఓ ఎటెంప్ట్ చేస్తే తప్పేం లేదనుకున్నాడో కానీ.. ఈసారి రూటు మార్చి ఏకంగా ఓ సాంగ్ కి కొరియోగ్రఫీ అందించేశాడు.
సుకుమార్ నిర్మాతగా సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన కుమారి 21 ఎఫ్ చిత్రంలో ఓ పాటకి దేవీ కొరియోగ్రఫీ చేశాడు. ఈ సంగతిని సుకుమార్ స్వయంగా చెప్పాడు. దేవీ కొరియోగ్రఫీ చేసిన పాట సినిమాకే హైలైట్ గా ఉందని చెబుతున్నారు. దేవీలోని ఈ కొత్త కోణం అందరికీ సర్ ప్రైజ్. రాజ్ తరుణ్ -హేబా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవీ మ్యూజిక్, కొరియోగ్రఫీ చేశాడు కాబట్టి అతడి పనితనం ఎంతో చూడాలంటే ఈ నెల 30 (రిలీజ్ డే) వరకూ వేచి చూడాల్సిందే.