Begin typing your search above and press return to search.

దేవీ.. అక్కడా కాపీ ట్యూన్‌ లెందుకు?

By:  Tupaki Desk   |   20 Aug 2015 8:56 AM GMT


దేవీశ్రీ ప్రసాద్‌ టాలీవుడ్‌ లోనే కాదు, బాలీవుడ్‌ లోనూ ఫేమస్సే. కండల హీరో సల్మాన్‌ ఖాన్‌ ప్రోత్సాహంతో అప్పట్లో 'దింక చిక దింక చిక' అంటూ తెలుగు ట్యూన్‌ ని అక్కడ వినిపించి మంచి మార్కులే వేయించుకున్నాడు. ఆర్య సినిమాలో పాపులర్‌ ఐటెమ్‌ నంబర్‌ రింగ రింగనే దింకచిక పేరుతో అక్కడా పాపులర్‌ చేశాడు. ఆ పాటతో దేవీకి బాగానే గుర్తింపు వచ్చింది కానీ ఛాన్సులైతే రాలేదు.

ఇక చాలా కాలంగా ఓ బాలీవుడ్‌ సినిమాకి మ్యూజిక్‌ ఇవ్వాలన్న దేవీ కోరిక నెరవేరనేలేదు. అయినా మరోసారి బాలీవుడ్‌ పిలిచి మరీ అవకాశం ఇచ్చింది. అక్కడ ఖునాల్‌ ఖీము హీరోగా నటించిన భాగ్‌ జానీ సినిమాకి మరో ఐటెమ్‌ నంబర్‌ సాయం చేశాడు. ఈసారి కూడా తెలుగు సినిమాలో కాపీ ట్యూన్‌ నే అక్కడ అందించాడు. శంకర్‌ దాదా ..లోని ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్‌ పెడతా చిన్నోడా! పాటనే అక్కడ రీమిక్స్‌ చేశాడంతే. డాడి మమ్మీ అంటూ లిరిక్‌ లో మ్యాజిక్‌ చేశారు. అయితే ఈ ట్యూన్‌ విన్నవాళ్లంతా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

ఇలా కాపీ ట్యూన్లు ఇవ్వాల్సిన కర్మేంటి? కొత్త ట్యూన్‌ ఇవ్వొచ్చు కదా! అని ప్రశ్నిస్తున్నారు. ఒరిజినల్‌ ట్యూన్‌ తో హిట్టు కొట్టి హిందీ ఛాన్సులు పట్టేస్తే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దేవీ దగ్గర సమాధానం ఉందా? (కునాల్‌ ఖీము నటించిన భాగ్‌ జానీ సెప్టెంబర్‌ 25న రిలీజవుతోంది. శివమ్‌ నాయిర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు)