Begin typing your search above and press return to search.
దేవిశ్రీకి బ్యాక్ టు బ్యాక్ పంచ్
By: Tupaki Desk | 4 Oct 2015 3:53 AM GMTనిజానికి ఒక కంటెంట్ లేని సినిమాను సంగీత దర్శకుడు ఎంతవరకు కాపాడగలడు? ఒకవేళ కంటెంట్ కాస్త యావరేజ్ గా ఉంటే.. ఏదో నాలుగు మాంచి పాటలు.. నాలుగు చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాకులతో సినిమాను పరిగెత్తించడంలో మ్యూజిక్ డైరక్టర్ హెల్ప్ చేస్తాడు. కాని పాపం మన దేవిశ్రీ ప్రసాద్ ఎంత సాయం చేద్దామని చూసినా మాత్రం.. ఈసారి పంచ్ లు తినక తప్పలేదు.
మొన్న రిలీజ్ అవ్వకుండా ఐటి దాడికి దొరికిపోయి.. రెండు రోజులు లేటుగా రిలీజ్ అయిన సినిమా ''పులి''. ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసింది దేవిశ్రీయే. అయితే మనోడు పాటల పరంగా ఎంత మేలు చేయాలని చూసినా కూడా.. అవన్నీ సినిమాలో పెద్దగా క్లిక్కవ్వలేదు. శృతి హాసన్ అందాలతో.. విజయ్ చేసిన రొటీన్ డ్యాన్సులతో ఓ రెండు పాటలు హాట్ హాట్ గా అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమాలో మ్యూజిక్ ఎంతగా కిక్కివ్వలేదో.. సినిమా అంతకంటే కిక్ ఇవ్వలేదు. జస్టు డిజాష్టర్ అంతే. ఇకపోతే తెలుగులో మొన్న రిలీజ్ అయిన ''శివం'' పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమాలో దేవి కొట్టిన మూడు పాటలు బాగున్నాయ్ కాని.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం తేలిపోయింది. ఇక కంటెంట్ ఎలాగో ఫుల్ గా డిజప్పాయింట్ చేసేసింది. సో.. దేవిశ్రీకి మళ్ళీ పంచ్ తప్పలేదు.
ఇవి రెండూ ఒకెత్తయితే.. ఇక హిందీలో మనోడు బాగ్ జానీ అనే సినిమా కోసం ఆకలేస్తే అన్నం పెడతా అనే సాంగును రీమిక్స్ చేసిచ్చాడు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాపే. సినిమాలో మ్యాటర్ ఉన్నా కూడా.. ప్రమోషన్ సరిగ్గా లేకపోవడం.. సినిమాలో అసలు పేరున్న స్టార్లు ఒక్కరు కూడా లేకపోవడంతో ఆ సినిమా ఢమాల్ అనేసింది. పాపం ఆ విధంగా దేవిశ్రీ ప్రసాద్ కి ఒకేసారి మూడు ఫ్లాపులొచ్చాయ్.