Begin typing your search above and press return to search.
దేవిశ్రీని ఏడిపించేసిన ఎన్టీఆర్
By: Tupaki Desk | 28 Dec 2015 6:15 AM GMT‘నాన్నకు ప్రేమతో’ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ చేసిన త్యాగం అలాంటిలాంటిది కాదన్నాడు ఎన్టీఆర్. తన తండ్రి చనిపోయిన మూడో రోజుకే ఈ సినిమా కోసం అతను తిరిగి పని మొదలుపెట్టాడని.. ఇలాంటి వ్యక్తిని తానెక్కడా చూడలేదని అన్నాడు ఎన్టీఆర్. చాలా ఎమోషనల్ గా మాట్లాడిన ఎన్టీఆర్.. దాదాపుగా కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. ఎన్టీఆర్ మాటలతో దేవి కూడా ఎమోషన్ ఆపుకోలేకపోయాడు. వేదిక మీద కన్నీటి పర్యంతం అయ్యాడు.
‘‘దేవిశ్రీ ప్రసాద్ ఎంత త్యాగం చేశాడో చెప్పలేను. అతనేం చేశాడో చాలామందికి తెలియదు. తన తండ్రి చనిపోయినపుడు నేను స్పెయిన్ లో ఉన్నాను. దేవి ఇక్కడ హైదరాబాద్ నుంచి చెన్నైకి బయల్దేరుతున్నాడు. నేను ఫోన్లో మాట్లాడ్డానికి ప్రయత్నించా. కుదర్లేదు. తర్వాత మెసేజ్ పెట్టాను. ఈ టైంలో ఫోన్ చేసి ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు.. ధైర్యంగా ఉండమని మెసేస్ పెడితే.. తర్వాత రెండో రోజు దానికి రిప్లై ఇచ్చాడు. ‘థ్యాంక్స్ తలైవా. నాన్న గారి అంత్యక్రియలు అయిపోయాయి. అమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నా. మా నాన్నే నాకు స్ఫూర్తి. ఈ రోజే రఘు దీక్షిత్ తో డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఎనఫ్ పాట పాడిస్తున్నా. ఏ కారణం కోసమైనా పని ఆపేయడం నాన్నకు ఇష్టం లేదు’’ అని రిప్లై ఇచ్చాడు’’ అన్నాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ఇలా మాట్లాడుతుండగానే దేవిశ్రీ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు. అతణ్ని తమ్ముడు సాగర్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ అది చూసి.. ‘నిన్ను ఏడిపించినందుకు సారీ దేవి’’ అన్నాడు. తర్వాత దేవి ఎన్టీఆర్ దగ్గరికొచ్చి అతణ్ని హత్తుకున్నాడు. ఈ సందర్భంగా దేవికి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలని ఎన్టీఆర్ చెప్పగా ఆడిటోరియంలోని జనమంతా లేచి నిలబడి చప్పట్లతో అతణ్ని అభినందించింది.