Begin typing your search above and press return to search.
‘గురువు’తో మళ్లీ డీప్ గా టచ్ చేశాడే
By: Tupaki Desk | 1 March 2017 10:01 AM GMTనాన్నకు ప్రేమతో అంటూ.. గుండెల్లో తన తండ్రి మీద అభిమానాన్ని.. ప్రేమను తన ట్యూన్ తో చెప్పేసిన దేవీశ్రీ ప్రసాద్ కోట్లాది గుండెల్ని ఎంతగా టచ్ చేశారో తెలిసిందే. నాన్న మీద ఆయనిచ్చిన ట్యూన్.. అందరిని విపరీతంగా ఆకట్టుకునేలా చేశారు. ఈసారి ఆయన గురువు మీద ఫోకస్ చేశారు. తన సంగీత గురువు మాండరిన్ శ్రీనివాస్ కు నివాళులు అర్పించేందుకు వీలుగా తాజాగా ఒక పాటను రూపొందించారు.
‘గురవేనమ’ పేరుతో రూపొందించిన ఈ పాట జనాల్ని విపరీతంగా కదిలించేస్తోంది. తన గురువు మీద తనకున్న అభిమానాన్ని పలు సందర్భాల్లో చాటుకున్న డీఎస్.. తాజా పాటతో తిరుగులేని నివాళిని అందించారని చెప్పాలి. సంస్కృతంలో రూపొందించిన ఈ పాట.. అన్ని భాషల వారిని ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ పాటను తానే స్వయంగా పాడేసిన వైనం ఇప్పుడు విపరీతంగా ఆకర్షిస్తోంది.
సరిగమ పదనిస అక్షరాలతో ఆధారంగా చేసుకొని రూపొందించిన తయారు చేసిన పాటను.. ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల ఈ పాటను రాయగా.. డీఎస్ ఆలపించారు. అన్ని భాషల వారిని విశేషంగా ఆకట్టుకునే ఈ పాటను మాండలిన్ శ్రీనివాస్ కు నివాళిగా అందించనున్నారు. తన గురువు మీద ప్రేమతో రూపొందించిన ఈ పాటను త్వరలో ఆవిష్కరణకార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనునట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. గురువుకు నివాళులు అర్పించేందుకు త్వరలో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కూడా చేయనున్నట్లు చెబుతున్నారు. తన గురువుకు నివాళులు అర్పించే క్రమంలో డీఎస్.. ఎంతోమంది శిష్యులకు అంతులేని స్ఫూర్తిని ఇస్తున్నారని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/