Begin typing your search above and press return to search.
అందుకే ఆ మ్యూజిక్ లోని మ్యాజిక్
By: Tupaki Desk | 8 Jun 2018 4:09 AM GMTదేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 సంవత్సరాలు అయింది. కెరీర్ మొదట్లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన దేవి కొన్ని సంవత్సరాలుగా ఆ పొజిషన్ లోనే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. ట్రెండ్ మారుతున్నప్పుడల్లా దానికి తగ్గట్టు సెట్ అవుతూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ తో డ్యాన్స్ వేయించేలా తన బీట్ తో అదరగొడుతూనే ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ రెమ్యునరేషన్ తక్కువేమీ కాదు. ఒక్కో సినిమాకు కనీసం రూ. 3 కోట్లయినా తీసుకుంటాడని టాలీవుడ్ లో వినిపించే టాక్. కొన్నిసార్లు ఈ ఫిగర్ ఇంకాస్త ఎక్కువే ఉంటుందిట.
హీరోలకు తప్ప టెక్నీషియన్లకు భారీ పేమెంట్లు ఇవ్వడానికి నిర్మాతలు పెద్దగా ఇష్టపడరు. కానీ అడిగినంత ఇచ్చి దేవినే తీసుకుంటున్నారంటే ఒక్కటే కారణం.. వర్క్ విషయంలో అతడు చూపించే అంకిత భావం. దేవిశ్రీ ప్రసాద్ కు మ్యూజిక్ పై గట్టి పట్టు ఉంది. ఒకసారి మ్యూజిక్ ఇవ్వడానికి కమిట్ అయ్యాడు అంటే బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి విపరీతమైన ప్రాక్టీస్ చేస్తాడట. అతడితోపాటు అతడి టీం కూడా ఈ విషయంలో హార్డ్ వర్క్ చేసి బెస్ట్ అనుకునే మ్యూజిక్ ఇస్తారు.
మెలోడీ.. ఫాస్ట్ బీట్.. మాస్ ఇలా ఏ జోనర్ కయినా హీరోకు తగ్టట్టు మ్యూజిక్ ఇస్తూ దేవీశ్రీ ప్రసాద్ ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు. తమిళంలో సింగం సిరీస్ కు దేవీ ఇచ్చిన సింగం.. సింగం.. హీ ఈజ్ నరసింగం ట్యూన్ ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉరకలెత్తించింది. డైరెక్టర్ హరి సింగం-3లో దేవీని కాకుండా హారిస్ జైరాజ్ ను పెట్టుకున్నాడు. అతడు ఈ ట్యూన్ నే వాడలేదు. దాంతో సింగం-3 ప్రేక్షకుల అస్సలు నచ్చలేదు. అదీ దేవీశ్రీ ప్రసాద్ లోని మ్యూజిక్ లోని మ్యాజిక్.