Begin typing your search above and press return to search.
దేవి శ్రీ ప్రసాద్ కూడా రాంగోపాల్ వర్మలా!
By: Tupaki Desk | 16 Dec 2022 1:30 AM GMTసంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మనసు పెట్ట సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటప్పుడు ఇది వర్మ సినిమా అని అభిమానులంతా ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. ఆయనపై ఎంత నెగిటివ్ ఉన్నా? ఆయన మనసు పెట్టి సినిమా చేస్తే ఔట్ ఫుట్ ఎలా ఉంటుందో భారతీయులందరికీ తెలుసు. కానీ ఆయన చేయడు. ఆయనకి నచ్చినప్పుడు చేస్తాడు.
నచ్చనప్పుడు 'ఐస్ క్రీమ్' ..'డేంజర్' లాంటి సినిమాలు చేస్తుంటాడు. ఇవన్నీ టైంపాస్ సినిమాలని ఆయనతో పాటు చూసే జనాలకి కూడా తెలుసు. ఇప్పుడీ వర్మ పురాణం దేనికంటారా? అయితే అసలు సంగతి లోకి వెళ్లాల్సిందే. వర్మ గురించి ఈ పరిచయమంతా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించే. దేవీ శ్రీ ఇప్పటివరకూ ఎలాంటి హిట్ ఆల్బమ్స్ అందించాడో చెప్పాల్సిన పనిలేదు.
ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ హిట్స్ ఉన్నాయి. కెరీర్ ఆరంభంలోనే 'ఆనందం' లాంటి సినిమాకి క్లాసిక్ మ్యూజిక్ అందించి? ఎవరి దేవి శ్రీ ప్రసాద్ అని అంతా అతని వైపు తిరిగి చూసారు. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాలతో శ్రోతల్ని ఆలరించారు. మరిప్పుడు రాక్ స్టార్ కూడా రాంగోల్ వర్మలా తయారవుతున్నాడా? మనసు పెట్టి పనిచేయడంలో ఫెయిలవుతున్నాడా? లేక పనిపై మనసే పెట్టకుండా పనిచేస్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తుంది.
ఇప్పుడీవే సందేహాలు శ్రోతల్ని..ఆయన అభిమానుల్ని తొలిచేస్తున్నాయి. 'పుష్ప' మినహా దేవి ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్ ఈ మధ్య కాలం ఓసారి వెతకండి అంటూ ప్రశ్నిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు పనిచేసిన 'ఉప్పెన' తర్వాత 'పుష్ప'కి మాత్రమే శ్రోతలు మెచ్చే సంగీతం అందించాడు. ఆ తర్వత తక్కిన సినిమాలన్ని వాటి ఫలితాలతో పాటు దేవి శ్రీ ప్రయత్నం కూడా ఫెయిల్చూర్ గానే కనిపిస్తుంది.
ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్' వాల్తేరు వీరయ్య'కి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ కొంత మందిని మెప్పించినా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటర్ డక్షన్ చూసే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆతర్వాత చిరంజీవి లీక్ చేసిన ఓ వీడియోలో హమ్ చేసాడు. అది విని అభిమానులకైతే గుండెపోటు వచ్చినంత పనైందని సోషల్ మీడియా కథనాలు అంతకంతకు వెడక్కిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో డీఎస్పీపై నెగిటివిటీ పెరిగిపోతుంది. డీఎస్పీ సుకుమార్... అతని శిష్యుల సినిమాలకు తప్ప తక్కిన సినిమాలకు మనసు పెట్టి పనిచేయడం లేదని..అందుకే పేలవమైన ఔట్ఫుట్ వస్తుందని..ఆ కారణంగానే మేకర్స్ అంతా థమన్ వైపు వెళ్లిపోతున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది. మరి ఈకథనాలపై దేవి శ్రీ ప్రసాద్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.