Begin typing your search above and press return to search.
దేవీ ఆయన్నెలా పట్టాడంటే
By: Tupaki Desk | 12 April 2018 8:18 AM GMTరాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పాటలను పాడించేందుకు ఎప్పుడూ కొత్త కొత్త సింగర్ల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ హీరో ఫరాన్ అక్తర్ నే తీసుకొచ్చాడు డీఎస్ పీ. ఆయనతో పాడించిన ‘ఐ డోంట్ నో’ పాటకి విపరీతమైన స్పందన వస్తోంది. అసలు దేవీశ్రీప్రసాద్ కీ... ఫరాన్ అక్తర్ ఎలా కనెక్ట్ అయ్యాడంటే...
దాని గురించి స్వయంగా దేవిశ్రీప్రసాదే మాట్లాడాడు. ‘‘రాక్ అన్ సినిమాలో ఫరాన్ అక్తర్ పాడిన పాట విన్నాక... ఆయన గొంతుకి అభిమానిగా మారిపోయా. కొన్నాళ్ల తర్వాత ఐఫా ఈవెంట్లో సింగపూర్ లో ఆయన్ని కలిశాను. అప్పటికే సల్మాన్ ఖాన్ ‘రెఢీ’ సినిమా కోసం ‘డింకఛికా...’ పాట రికార్డు చేశాను. ఫరాన్ ఆ పాట విన్నాడు. అంతకు ముందే ఆయన ‘అ... అంటే అమలాపురం’ పాట విన్నాడట. నాతో చాలా సరదాగా మాట్లాడాడు. మహేష్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో ‘హూ ఆర్ యూ...’ పాట ఫరాన్ తో పాడించాలనుకున్నా. కానీ ఆయన చాలా ఫర్ఫెక్షనిస్టు. తెలుగు తెలీదు నేను పాడనని చెప్పేశాడు....’’ అన్నాడు దేవీశ్రీ.
ఆ తర్వాత ‘భరత్ అనే నేను’ సినిమాలో పాటలో ఇంగ్లీషు పదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి... పాడడం కూడా చాలా తేలికని చెప్పి ఫరాన్ ని ఒప్పించాడట దేవి. మొదట చెన్నైలో ఈ పాట రికార్డు చేయాలనుకున్నా... ఫరాన్ బిజీ వల్ల స్వయంగా దేవీయే ముంబైకి వెళ్లి రికార్డు చేశాడట. దేవీశ్రీ ఎందుకు అంతగా ఫరాన్ కోసం తిరిగాడో... ఈ పాట వింటుంటే అర్థమవుతోంది. ఫరాన్ తన గొంతుతో మహేష్ పాటని రాక్ చేసేశాడు.