Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్ కాదు.. తెలుగు తలైవా

By:  Tupaki Desk   |   6 Oct 2015 7:59 AM GMT
యంగ్ టైగర్ కాదు.. తెలుగు తలైవా
X
తమ అభిమాన కథానాయకుల్ని ఉత్త పేరుతో పిలుచుకోవడానికి అస్సలు ఇష్టపడరు అభిమానులు. పేరు ముందు ఏదో ఒక బిరుదు ఉండి తీరాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్‌ కు సైతం అభిమానులు ఎప్పుడో ఓ బిరుదిచ్చేశారు.. యంగ్ టైగర్ అని. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే టైటిల్ సౌండింగే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఐతే దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఎన్టీఆర్.. యంగ్ టైగర్ కాదు.. ‘తెలుగు తలైవా’ అంటున్నాడు. ఇదేదో తెలుగు - తమిళం కలిసిన మాటలా ఉందే.. ఏంటీ కొత్త పిలుపు అని ఆశ్చర్యం కలుగుతోంది కదా.

మరి దేవిశ్రీ ప్రసాద్ ఇటు తెలుగులో, అటు తమిళంలో సినిమాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు కదా. అందుకే ఎన్టీఆర్ కు ఇలాంటి బిరుదిచ్చాడు. ఇంతకీ తలైవా అంటే ఏంటి అంటే.. ‘నాయకుడు’ అని అర్థం. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ను అభిమానులు ఇలా పిలుచుకుంటారు. ఐతే తెలుగులో రజినీకాంత్ అంతటి ఫాలోయింగ్ ఉన్నోడు అనే అర్థంలో ఈ పదం వాడాడేమో దేవిశ్రీ. ఈ మధ్య ‘కుమారి 21 ఎఫ్’ టీజర్ లాంచింగ్ సందర్భంగా ఎన్టీఆర్‌ కు ఇలా నామకరణం చేసి పోయాడు దేవి. ఈ పిలుపులో ఎంత వెయిట్ ఉన్నప్పటికీ.. అందులో తెలుగు ఫ్లేవర్ మిస్సింగ్ కాబట్టి దాన్ని జనాలు పట్టించుకునే అవకాశం లేదు.