Begin typing your search above and press return to search.

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

By:  Tupaki Desk   |   17 Jan 2016 6:59 AM GMT
''ఏ కష్టం ఎదురొచ్చినా.. ఏ కన్నీళు ఎదురొచ్చినా.. ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం..'' అంటున్నాడు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌. ఆల్రెడీ ఇప్పటికే పాడేసిన పాడే ఇది. సినిమాలో వచ్చేసింది కూడా. అయితే ఈ పాటను ''నాన్నకు ప్రేమతో'' ఆల్బమ్‌ లో పెట్టకుండా స్పెషల్‌ గా రిలీజ్‌ చేశారు సినిమా నిర్మాత.

నిన్న విడుదలైన ఈ స్పెషల్ సాంగ్‌ చూస్తుంటే.. దేవి శ్రీ ప్రసాద్‌ ఎంత ఫీల్‌ తో ఈ పాటను రాశాడో.. కంపోజ్‌ చేశాడో.. అర్దమైపోతోంది. అయితే ఈ పాట కోసం ఒక స్పెషల్‌ వీడియో కూడా రికార్డు చేయించాడు దేవి. ఇందులో మనోడు తన తండ్రి దివంగత రైటర్‌ సత్యమూర్తి గారి ఫోటోలు చూపించడమే కాకుండా.. కీ బోర్డు పై వాయిస్తూ కంపోజ్‌ చేయడం.. తమ్ము సాగర్‌ కూడా ఒక చరణ్‌ పాడటం.. ఇలా చాలా విజువల్స్‌ ను క్రియేట్‌ చేయించాడు. నాన్నకు ప్రేమతో అంటూ తన తండ్రిపై నిజమైన ప్రేమను కురిపించేశాడు. యుట్యూబ్‌ లో ఉన్న ఈ పాటను చూసి మీరు కూడా ఓసారి ఆ అనుభూతిని ఆస్వాదించండి.