Begin typing your search above and press return to search.
దేవి-సుక్కు.. డార్లింగే ఓసినా డార్లింగే
By: Tupaki Desk | 6 Aug 2017 9:51 AM GMTఫోన్ చేసిన వాళ్లకు రింగ్ టోన్ రూపంలో మంచి పాట వినిపించడం మామూలే. కానీ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఒకరికొకరు ఫోన్ చేసుకున్నపుడు స్వయంగా పాట పాడి వినిపిస్తారట. ఆ పాట ‘మిర్చి’ సినిమాలోని ‘డార్లింగే ఓసినా డార్లింగే’ అట. సందర్భం ఏదైనా సరే.. వీళ్లిద్దరిలో ఎవరు ఎవరికి ఫోన్ చేసినా సరే.. ముందుగా ఒకరు ‘డార్లింగే ఓసినా డార్లింగే’ అంటే.. అవతలి వాళ్లు కూడా అదే లైన్ పాడాక వేరే సంభాషణ మొదలవుతుందట. మామూలు సరదా సంభాషణలే కాదు.. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని ఫోన్ చేసినా ఇద్దరూ ముందు ఈ డార్లింగ్ పాట పాడాలన్నది నియయమని తెలిపాడు దేవిశ్రీ.
ఇంతకుముందు సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’కి సంగీతం అందించి.. రెండో ప్రొడక్షన్ ‘దర్శకుడు’కి మ్యూజిక్ ఇవ్వకపోవడంపై దేవి స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా సంగతి నాకు సుకుమార్ చెప్పలేదు. సుక్కు అన్నయ్య కొడుకు అంటే నాకు అభిమానం ఉండదా? నాకు చెప్పకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా నా పేరు అనౌన్స్ చేసి ఉన్నా నేను ఫీలయ్యేవాడిని కాదు. సుకుమార్ ‘కుమారి 21 ఎఫ్’ సినిమా తీయాలనుకున్నపుడే నన్ను సంగీత దర్శకుడిగా అడగడానికి మొహమాటపడ్డాడు. నా దగ్గరికొచ్చి ‘నువ్వు చాలా బిజీ. మంచి మ్యూజిక్ ఇస్తావ్’.. అంటూ మొదలుపెట్టి అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. చివరికి విషయం చెప్పమంటే.. మొహమాట పడుతూ ఆ సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలన్నాడు. ఓస్ ఇంతేనా అనిపించింది’’ అని చెప్పాడు.