Begin typing your search above and press return to search.
ఆయనకు 150.. మాకు మొదటిదే -డీఎస్పీ
By: Tupaki Desk | 10 Jan 2017 5:11 PM GMTమెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈమూవీలోని అన్ని పాటలు ఛార్ట్ బస్టర్స్ గా నిలవడమే కాదు.. యూట్యూబ్ లో కోటి వ్యూస్ అనే మార్క్ సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది. దేవిశ్రీ అంటే తన మ్యూజిక్ తోనే సగం హిట్ చేస్తాడు అనే మాటను మరోసారి నిలబెట్టుకున్నాడు ఈ రాక్ స్టార్. అయితే.. మెగాస్టార్ 150వ చిత్రానికి పని చేయడం అనే అనుభవం ఎలా ఉందో పంచుకున్నాడు డీఎస్పీ.
'నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్. ఆయన డ్యాన్సులు సినిమాలూ చూస్తూ పెరిగా. ఆయన ఓసారి కాల్ చేసి 150వ మూవీ చేద్దాం అన్నారు. అప్పుడే అది నా బాధ్యతగా స్వీకరించాను. ఆయనకు 150వ సినిమా కానీ.. ఆ మూవీ పని చేసిన ప్రతీ ఒక్కరు అదే తమ మొదటి సినిమా అన్నంత హుషారుగా పని చేశాం. ఎందుకంటే అక్కడ అందరం మెగా ఫ్యాన్సే. అంతమంది మెగా ఫ్యాన్స్ ఒకచోట చేరి వర్క్ చేస్తే ఆ మజా వర్ణించడానికి మాటలు చాలదు' అన్న డీఎస్పీ.. ఓ విచిత్రమైన అనుభవాన్ని కూడా చెప్పాడు.
'నేను అప్పటికే మెగా150కి పని చేస్తానని చెప్పినా.. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ నన్ను పిలిచి మరీ.. "నువ్వు బిజీగా ఉన్నావని తెలుసు.. అయినా సరే నా 150వ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వాల్సిందే" అనడం ఆశ్చర్యం వేసింది. ఆయన సరదాగా అలా మాట్లాడినా.. అందులో నాకు బోలెడంత బాధ్యత కనిపించింది. ఆ మూవీకి ఇచ్చిన సంగీతంలో ప్రతీ లైన్ ను మెగాస్టార్ కి సరిపోయేలా.. ఆయన్ని ఊహించుకుంటూ చేసినదే' అని చెప్పాడు దేవిశ్రీ ప్రసాద్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/