Begin typing your search above and press return to search.
దేవిశ్రీ అయితే సీన్ వేరేగా ఉండేదా!?
By: Tupaki Desk | 11 Jan 2018 7:06 AM GMTపవన్ కళ్యాణ్ 25వ చిత్రం అంటూ విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీ అజ్ఞాతవాసి. ముందు నుంచే జరిగిన అడ్వాన్స్ బుకింగ్.. అదనపు షోలు.. పెరిగిన టికెట్ రేట్స్ ప్రభావంతో.. తొలి రోజు కలెక్షన్స్ భారీగా వచ్చాయని ట్రేడ్ జనాలు చెబుతున్నారు. అయితే.. ఈ చిత్రంపై నెగిటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇలాంటి సినిమానా అనే మాట గట్టిగానే వినిపిస్తోంది. మూవీలో ఏదో మ్యాజిక్ మిస్ అయిందనే మాటల మధ్యే.. సినిమాకు అతి పెద్ద లోటు అంటూ అనిరుధ్ అందించిన మ్యూజిక్ ని చెబుతున్నారు ఆడియన్స్. పవర్ స్టార్ కి తగినట్లుగా ఎక్కడా ఎలివేషన్ మ్యూజిక్ అనేదే లేకపోవడం ఫ్యాన్స్ కు మనస్తాపం కలిగించే విషయమే. అసలు సన్నివేశానికి తగినట్లుగానే మ్యూజిక్ లేదనే ఫీలింగ్ చాలామందిని వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలకే కాదు.. సహజంగా మన తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగినట్లుగా మ్యూజిక్ ఇవ్వడంలో దేవిశ్రీ ప్రసాద్ దిట్ట.
ఎంసీఏ లాంటి సాధారణ చిత్రానికి కూడా డీఎస్పీ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో విలువ పెంచాడు. సరైనోడు లాంటి సినిమాలకు థమన్ అందించిన బీజీఎం ఎంతగా ప్లస్ అయిందో తెలిసిందే. కానీ అజ్ఞతవాసి విషయానికి వస్తే.. మ్యూజిక్ థీమ్ ను కూడా లార్గో వించ్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫ్రెంచ్ సినిమా మాదిరి సంగీతం మనకెక్కడ ఎక్కుతుంది బాబూ అని జనాలు నెత్తినోరు బాదుకుంటున్నారు. అజ్ఞాతవాసి కంటెంట్ పరంగా నిరుత్సాహపరిచినా.. ఈ సినిమాకి డీఎస్పీ కానీ.. థమన్ కానీ సంగీతం ఇచ్చి ఉంటే.. పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉండేది కాదని టాక్.