Begin typing your search above and press return to search.
రాజుల సినిమా కోసం రాక్ మ్యూజిక్కా??
By: Tupaki Desk | 14 Sep 2015 5:30 PM GMTరిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ విజయ్ నటించిన పులి చిత్రానికి క్రేజ్ పెరుగుతోంది. ప్రచార కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి నటించడంతో.. తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. తాజాగా పులికి ఒక ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు.
పులికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్.. తనే యాక్ట్ చేసి మరీ ఓ ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారు. పులి.. పులి.. పులి.. పులి.. అంటే సాంగ్ వినడానికైతే సూపర్ గానే ఉంది. పులిలా దూకుతున్నట్లుగా డీఎస్పీ వేసిన సిగ్నేచర్ స్టెప్ కూడా.. మ్యూజిక్ థీమ్ కి తగ్గట్టుగా ఉండి ఆకట్టుకుంటోంది.
అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. పులి మూవీ రాజుల ఇతివృత్తంతో తీశారు. మరి సంగీతం కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ నే ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. కానీ.. పూర్తి రాక్ మ్యూజిక్ తో సాగే పాటకి.. వెనకాల పులిలో పాతకాలంనాటి విజువల్స్ చూపిస్తుంటే.. చూడ్డానికి చిరాగ్గా అనిపిస్తోంది. ఎంత ప్రమోషన్ సాంగ్ అయితే మాత్రం.. జనాలకు మరీ ఇలా ఏది పడితే అది చూపిస్తానంటే ఎలా ? కేవలం ప్రోమో వరకే అయితే కొంత ఊరట. వెరైటీగా ఉంటుందని.. మూవీలో కూడా ట్రై చేస్తే.. ఇక జనాల మీదకు పులి దాడిచేసినట్లే !