Begin typing your search above and press return to search.
శృతి హసన్ కు నామకరణం చేసిన దేవి
By: Tupaki Desk | 26 July 2015 5:54 AM GMTమొన్నటికి మొన్న శ్రీమంతుడు ఆడియో వేడుకలో శృతి హాసన్ పై హాట్ కామెంట్ చేసిన దేవీ శృతి హాసన్ కి పేరు కూడా పెట్టాడట. వీరిద్దర మధ్య అంతుందా అని నోరెళ్లబెట్టకండి... దేవి పేరు పెట్టింది సినిమాలో శృతి హాసన్ పాత్రకి.
సినిమా షూటింగ్ కి ముందే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుంటాయ్. అదే దారిలో శ్రీమంతుడు సినిమా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నపుడు దేవి ఓ పాట కోసం కొన్ని పదాలతో సరదాగా హమ్ చేస్తున్నాడట. అందులో నుండి వచ్చిందే చారుశీల అన్న పాట. అయితే ఈ పేరు దర్శకుడు కొరటాల శివకి తెగ నచ్చేసిందట. అప్పటికి కథ సిద్ధమయినా శృతి పాత్రకి పేరు పెట్టలేదట. దాంతో దేవి శృతి పాత్రకి నామకరణం చేసేశాడన్నమాట. ఏమైనా దేవి రచయితలపై బాగా ప్రభావం చూపిస్తున్నాడు. ఓ పక్క పాటలు రాసేస్తున్నాడు. ఇప్పుడేమో పాత్రకి పేరు పెట్టాడు. భవిష్యత్తులో ఏకంగా కథ రాసి సినిమా కూడా చేస్తాడేమో..!