Begin typing your search above and press return to search.
దేవిశ్రీ కొంచెం కూడా తగ్గట్లేదట
By: Tupaki Desk | 2 Feb 2017 4:27 PM GMTరాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రెండు నెలలుగా ఎక్కడ విన్నా.. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ అయిన ఖైదీ నంబర్ 150 సాంగ్స్ మాత్రమే వినిపిస్తున్నాయంటే.. తన మ్యూజిక్ తో దేవిశ్రీ చేసిన మ్యాజిక్ ఏంటో అర్ధమవుతుంది.
అమ్మడు.. కుమ్మడు అంటూ మ్యూజిక్ ని కుమ్మేయడమే కాదు.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా కుమ్మేస్తున్నాడు రాక్ స్టార్. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ చేయించుకోవాలంటే చెల్లించుకోవాల్సిన మొత్తం ఎంతో తెలుసా? 2.5 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప సినిమాకి సైన్ చేసేది లేదని తేల్చేస్తున్నాడట. తన దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఇదే మాట చెప్పేస్తున్నాడని అంటున్నారు. అంతగా తనకు బాగా కావాల్సిన వాళ్లు అయితే మాత్రం.. ఓ టెన్ పర్సెంట్ అంటే 25 లక్షల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నాడట.
ఇది కేవలం దేవిశ్రీకి ముట్టచెప్పాల్సిన పారితోషికం మాత్రమే. తన దగ్గర ఉండే లిరిక్ రైటర్స్.. సింగర్స్.. టెక్నీషియన్స్ కు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటే.. కేవలం మ్యూజిక్ డిపార్ట్ మెంట్ కే కనీసం 3 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్న మాట.